Hollywood: ఏంజెలీనా, బ్రాడ్ పిట్ విడాకుల కేసులో కొనసాగుతున్న న్యాయ పోరాటం.. తాజాగా ఏంజెలినా లెటర్ వైరల్..

|

Oct 14, 2022 | 11:25 AM

బ్రాడ్ పిట్ మద్యపానాన్ని విడిచిపెట్టడానికి చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. బ్రాడ్ పిట్ 'తన వ్యసనంతో కుటుంబం జీవితానికి ముగింపు ఇచ్చాడు..  మద్యానికి బానిసగా మారి ఎప్పుడూ దాని చుట్టూ తిరిగాడు.

Hollywood: ఏంజెలీనా, బ్రాడ్ పిట్ విడాకుల కేసులో కొనసాగుతున్న న్యాయ పోరాటం.. తాజాగా ఏంజెలినా లెటర్ వైరల్..
Brad Pitt And Angelina Joli
Follow us on

హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్ , ఏంజెలీనా జోలీ మధ్య న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ జంట సెప్టెంబరు 2016లో విడాకుల కోసం దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో యుద్ధం జరుగుతూనే ఉంది. ఏంజెలీనా జోలీ , బ్రాడ్ పిట్ విడాకుల కేసులో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు స్టార్లు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు.  ఇదిలా ఉండగా తాజాగా ఏంజెలినా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లెటర్ ను ఏంజెలీనా 2021లో తన మాజీ భర్తకు పంపింది. ఈ లేఖను కూడా కోర్టులో సమర్పించారు.

వైరల్ అవుతున్న ఈ లేఖలో… ఏంజెలీనా ఇలా రాసింది, “ఇక్కడే మేము కవలలను (నాక్స్ , వివియెన్) ఇంటిలోని ఆహ్వానించాము. మా అమ్మ సాక్షిగా వివాహం చేసుకున్నాము. ఇక్కడే తమ జీవితాంతం గడుపుదామని.. తాను వృద్ధాప్య సమయంలో ఈ ఇంట్లోనే   ఉంటానని అనుకున్న స్థలం. ఈరోజు నేను కన్నీరు పెట్టకుండా ఉండడం నావల్ల కావడం లేదు. ఈ నా జ్ఞాపకాలను ఒక దశాబ్దం కాలం తర్వాత కూడా గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు ఏంజెలినా.”

వైన్ చుట్టూ జీవితం
బ్రాడ్ పిట్ మద్యపానాన్ని విడిచిపెట్టడానికి చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. బ్రాడ్ పిట్ ‘తన వ్యసనంతో కుటుంబం జీవితానికి ముగింపు ఇచ్చాడు..  మద్యానికి బానిసగా మారి ఎప్పుడూ దాని చుట్టూ తిరిగాడు. అయితే ఏదొక రోజు అది మనల్ని ఒకచోట చేర్చి, మనకు కాంతి, శాంతిని ఇచ్చేదిగా మారుతుందని తాను ఆశించానట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు నన్ను నిజంగా ఎలా ఇష్టపడుతున్నారో ఇప్పుడు నేను చూస్తున్నానని లెటర్ లో ప్రస్తావించింది ఏంజెలినా.

ఇవి కూడా చదవండి

‘కుటుంబంపై చెడు అలవాట్ల ప్రభావం’

ఏంజెలీనా ఆ లేఖలో ఇంకా ఇలా రాసింది..  “వ్యాపారాన్ని పంచుకోవడానికి లేదా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపని విధానంతో పాటు..  బ్రాడ్ పిట్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల తాను బాధపడ్డానని పేర్కొన్నది. ఇటీవల మద్యం విక్రయం కోసం విడుదలైన చిత్రాలను చూసి కదిలిపోయాయని చెప్పింది ఏంజెలినా. తాను బ్రాడ్ పిట్ తీసుకున్న బాధ్యతారాహిత్య చర్యగా భావిస్తున్నానని .. తమ పిల్లలు దీన్ని చూడకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను బ్రాడ్ పిట్ తో ఉన్న సమయంలో ఎదురైనా చెడు సమయాన్నీ గుర్తు చేస్తుందన్నారు. తన మాజీ భర్త బ్రాడ్ పిట్‌కి చెందిన అనేక విషయాలు ఈ లెటర్ ద్వారా ఏంజెలినా తెలియజేసింది. బ్రాడ్ పిట్ తన చెడు అలవాట్లు .. తమ కుటుంబం, వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపిందో ఈ ఉత్తరం ద్వారా వివరించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..