AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth: ఆ హీరోలాగా ఉండడం ఎవరి వల్ల కాదు.. రిస్క్ చేయడంలో ఆయన ముందుండేవారు.. శ్రీకాంత్..

దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో హీరోగా తనదైన ముద్ర వేశారు హీరో శ్రీకాంత్. ఒకప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే నటులలో ఆయన ఒకరు. ప్రస్తుతం సహయ నటుడిగా పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒక సినిమా విజయానికి, అపజయానికి ప్రధాన కారణం దర్శకుడేనని, దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్గా చెప్పుకొచ్చారు. నటీనటులు కేవలం నటిస్తారని, మిగిలిన 24 క్రాఫ్ట్స్‌ను సమన్వయం చేసేది దర్శకుడేనని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Srikanth: ఆ హీరోలాగా ఉండడం ఎవరి వల్ల కాదు.. రిస్క్ చేయడంలో ఆయన ముందుండేవారు.. శ్రీకాంత్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2026 | 10:36 AM

Share

హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణగారి విశిష్ట స్థానాన్ని, అలాగే సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రాముఖ్యతను వెల్లడించారు. శ్రీకాంత్ కృష్ణగారి నిజాయితీని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక సినిమా విజయవంతం కాలేదని తెలిసినప్పుడు, కృష్ణగారు ఏమాత్రం సంకోచించకుండా నా సినిమా ఫ్లాప్ అయ్యింది అని స్వయంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. అటువంటి అరుదైన ఫ్రాంక్‌నెస్, నిజాయితీ మరెవరిలోనూ కనిపించవని శ్రీకాంత్ అన్నారు. కృష్ణగారి డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావాన్ని, ఆయన చేసిన సాహసాలను, ప్రయోగాలను శ్రీకాంత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్స్పెరిమెంటల్ చిత్రాలను నిర్మించడంలో, కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో కృష్ణగారు ఎల్లప్పుడూ ముందుండేవారని, వాటి ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన వాటి గురించి క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు సాగేవారని తెలిపారు. సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే, కొందరు రచయితలనో, దర్శకులనో నిందించడం చేస్తుంటారని, కానీ కృష్ణగారు అటువంటి వారికి పూర్తి భిన్నమని శ్రీకాంత్ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

తన సినీ ప్రయాణంలో, శ్రీకాంత్ దర్శకుడి పాత్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్గా అభివర్ణించారు. ఒక సినిమా విజయం లేదా అపజయం పూర్తిగా దర్శకుడి చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. నటీనటులు కేవలం కథ విని, తమ పాత్రను పోషించి వెళ్ళిపోతారని, కానీ సినిమాకు ప్రాణం పోసేది, దానిని ఒక కళాఖండంగా మలిచేది దర్శకుడేనని శ్రీకాంత్ వివరించారు. కెమెరా డిపార్ట్‌మెంట్ నుండి మ్యూజిక్, డైలాగుల వరకు, ప్రతి షాట్‌లో అందం, విజువల్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్‌ను పర్యవేక్షించేది దర్శకుడేనని ఆయన చెప్పారు. ఇరవై నాలుగు క్రాఫ్ట్స్‌ను సమన్వయం చేసే బాధ్యత దర్శకుడిదేనని, ఈ విషయంలో హీరోలు లేదా ఇతర సాంకేతిక నిపుణుల పాత్ర పరిమితమని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

తెలుగు సినీ చరిత్రలో దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, కె. విశ్వనాథ్, బాపు వంటి లెజెండరీ దర్శకులు తమ చిత్రాలతో దర్శకుడికి ఒక ప్రత్యేక గౌరవాన్ని, విలువను తీసుకొచ్చారని శ్రీకాంత్ ప్రస్తావించారు. వారి సినిమాల్లో పనిచేయాలని ప్రతి నటుడు కోరుకుంటాడని తెలిపారు. ప్రస్తుత తరం దర్శకులలో రాజమౌళి గారిని ఉదాహరణగా పేర్కొంటూ, ఎంత పెద్ద హీరో అయినా రాజమౌళి సినిమాలో నటించడానికి సిద్ధపడతాడని, ఆయన విజన్, డైరెక్షన్‌ను పూర్తిగా నమ్ముతాడని అన్నారు. రాజమౌళి ఏమి చెబితే అది చేసి వెళ్ళిపోవడమేనని, ఆయన నిర్ణయాలపై ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉండదని శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us