Gautam Benegal: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ బెనెగల్ మృతి..

ఇటీవల సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్.. సురేఖా సిక్రి మృతిచెందిన విషయం మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు,

Gautam Benegal: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ బెనెగల్ మృతి..
Gautham Benegal

Edited By:

Updated on: Jul 17, 2021 | 5:21 PM

ఇటీవల సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్.. సురేఖా సిక్రి మృతిచెందిన విషయం మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కార్టూనిస్ట్ గౌతమ్ బెనెగల్(55) కన్నుముశారు. శుక్రవారం గుండెపోటుతో తన నివాసంలోనే గౌతమ్ మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు నటుడు కైజాద్ కొత్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

“గౌతమ్ బెనెగల్ ఇక లేరు అనే వార్త నన్ను షాక్‏కు గురిచేసింది. నిన్న నాతో మాట్లాడుకున్నాము. భారతదేశం.. ముఖ్యంగా కళాత్మక, మేదో రంగానికి అపారమైన నష్టం కలిగింది. గౌతమ్ ఆత్మ శాంతించాలి” అంటూ ట్వీ్ట్ చేశారు కైజాద్ కొత్వాల్.

ట్వీట్..

1965లో కోలకతాలో జన్మించిన గౌతమ్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆర్టిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 2010లో ఆయన నిర్మించిన లఘుచిత్రం ‘ది ప్రిన్స్ అండ్ ది క్రోన్ ఆఫ్ స్టోన్’కు రెండు రజత్ కమల్ జాతీయ అవార్డులు లభించాయి. అతని చిత్రాలు టెహ్రాన్, బెలారస్, హిరోషిమా కైరోలలోని చలన చిత్రోత్సవాలకు నామినేట్ చేయబడ్డాయి. సోషల్ మీడియాలో గౌతమ్‌కు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు పోస్ట్ చేసే కార్టూన్లపై నెటిజన్ల మధ్య విపరీతమైన చర్చ జరుగుతుంటుంది.

ట్వీట్స్..

Also Read:  Suresh Babu: గత అనుభవాలతోనే ఇలా.. వెంకటేష్ చాలా బాధపడ్డాడు..’నారప్ప’ రిలీజ్ పై సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్..

Rakul Preet Singh: లేటెస్ట్ ఫోటో షేర్ చేసిన రకుల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలుసా..

Cinema Theatres: తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్.. 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం

Rashmika Mandanna: నెట్టింట్లో రష్మిక మందన్న హల్‏చల్.. మరో రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ..