
సుమారు మూడేళ్ల సుదీర్ఘ చిత్రీకరణ తర్వాత పుష్ప2 సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఆల్ టైం ఇండస్ట్రీ దిశగా పుష్ప వేగంగా అడుగులు వేస్తోంది. ఇక పుష్పతో అల్లు అర్జున్‌కు నేషనల్ వైడ్‌గా అభిమానులు సొంతమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పుష్ప2 ప్రమోషన్స్‌లో భాగంగా బిహార్‌లో జరిపిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తరలివచ్చిన అభిమానులే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇక గుజరాత్‌లో కూడా బన్నీ ఫ్యాన్స్ హంగామా చేశారు. స్క్రీనింగ్ ఆలస్యమైందన్న కారణంతో థియేటర్ వద్ద ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని జామ్‌నగర్ పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో గురువారం ఉదయం 6.30 గంటలకు పుష్ప2 స్క్రీనింగ్ జరగాల్సి ఉంది.
Gujarat: In Jamnagar, angered viewers at PVR Multiplex caused a disturbance when the Pushpa 2 screening, scheduled for 6:30 AM, was delayed due to technical issues. The frustrated audience tore down posters, prompting the cinema management to call the police to restore order pic.twitter.com/P05seajbKX
— IANS (@ians_india) December 5, 2024
అయితే ఏదో టెక్నికల్ సమస్యల కారణంగా పుష్ప2 ఆలస్యమైంది. దీంతో అభిమానులు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. సినిమాకు అంతరాయం ఏర్పడడంతో థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్టీ ప్లెక్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఒక తెలుగు హీరో కోసం గుజరాత్‌లో అభిమానులు ఇలా చేయడం విశేషమంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..