Keerthy Suresh: మన హీరోయిన్ల డెడికేషన్‌కు ఫిదా కావాల్సిందే..! ఇప్పుడు ఆ లిస్ట్‌లో కీర్తి సురేష్..!
ఇటీవల పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్.. వారం రోజులు కూడా తిరక్కుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా హాట్ లుక్స్ తో కనిపిస్తూనే మన సాంప్రదాయం పట్ట తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం ఆరు పాటలు నాలుగు సీన్స్ కు మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉండేది ఇన్నాళ్లు పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లోనూ తమ మార్క్ చూపించేందుకు కష్టపడుతున్నారు. గ్లామర్ తో పాటు నటనకు కూడా స్కోప్ ఉండే రోల్స్ ను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. కేవలం సినిమాలో నటించటం వరకే కాదు ఆ సినిమాల ప్రమోషన్ బాధ్యతలను కూడా నెత్తికెత్తు కుంటున్నారు. తమ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఏ మాత్రం సినిమాల మీద పడకుండా చూసుకుంటున్నారు. అందుకే కోసం రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు.
రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్.. వారం రోజులు కూడా తిరక్కుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా హాట్ లుక్స్ తో కనిపిస్తూనే మన సాంప్రదాయం పట్ట తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు కీర్తి. బేబీ జాన్ ప్రమోషన్స్ లో మెడలో పసుపు తాడుతోనే కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.
బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్..
View this post on Instagram
గతంలో దీపిక..
కీర్తి సురేష్ మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపిక పదుకోన్ కూడా ఇదే డెడికేషన్ చూపించారు. కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ టైమ్ కు నిండు గర్భవతిగా ఉన్న దీపిక, ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్నారు. దేశమంత తిరిగి అవకాశం లేకపోవటంతో మీడియా ఇంటర్వ్యూ లతో పాటు ముంబై ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొని సినిమాకు నార్త్ లో మంచి హైప్ తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.
అలియా భట్ కూడా..
మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. బ్రహ్మాస్త్ర సినిమా టైమ్ లో ప్రెగ్నెంట్ అయిన అలియా, అలాగే ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ తరువాత ప్రమోషన్స్ లోనూ గర్భవతిగానే పాల్గొన్నారు. అదే టైమ్ లో సెట్స్ మీద ఉన్న హాలీవుడ్ యాక్షన్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ లోనూ పాల్గొన్నారు. ఆ సినిమా కోసం ప్రెగ్నెంట్ గా ఉండే రిస్కీ స్టంట్స్ కూడా చేశారు ఆలియా భట్. మరో బాలీవుడ్ బ్యూటీ నేహా దూపియా కూడా గర్భవతిగా ఉండి ఓ వెబ్ సిరీస్ లో నటించారు.