Kaushik LM: సిని పరిశ్రమలో మరో విషాదం.. కోలివుడ్ కి చెందిన ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. నిద్రలోనే ఆయన కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 35 ఏళ్లు. 1987లో జన్మించిన కౌశిక్ ఎల్ ఎం సినిమా రివ్యూలు, తమిళనటుల ఇంటర్వ్యూలు చేయడంలో ఎంతో పేర్గాంచారు. యువ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ అకాల మరణంతో తోటి క్రిటిక్స్, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాక్సాఫీస్ రిపోర్టులు, మూవీ అప్ డేట్స్ అందించడంలో ప్రసిద్ధి చెందారు.
సీతారామం మూవీకి సంబంధించి చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఓ ట్వీట్ ను కూడా చేశారు. త్వరలో విడుదల కానున్న రోహిణి, కరుణాకరన్ నటించిన తమిళ చిత్రం జీవి 2 యొక్క ప్రెస్ మీట్‌కు కౌశిక్ హాజరు కావాల్సి ఉంది . అతను కార్యక్రమానికి రాకపోవడంతో, స్నేహితులు కౌశిక్ కు ఫోన్ చేసినా స్పందన రాలేదు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన కౌశిక్ ప్రముఖ తమిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్‌వుడ్స్‌లో ఫిల్మ్ క్రిటిక్ గా వృత్తిని ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ఇచ్చే కౌశిక్ ఎల్ ఎం ఇక లేరన్న వార్త ఆయన ఫాలోవర్స్ ను షాక్ కు గురిచేసింది. ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్ ట్రాకర్, యూట్యూబ్ వీడియో జాకీ, మూవీ రివ్యూయర్, క్రికెట్, టెన్నిస్ బఫ్ గా గుర్తింపు పొందారు కౌశిక్. మూవీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేసే కౌశిక్ తన బ్రిలియంట్ క్వశ్చన్స్ తో పాటు, మాట్లాడే విధానానికి ఎంతో మంది ముగ్దులయ్యేవారు.
దేశ వ్యాప్తంగా మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గలాట్టా యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు కౌశిక్. యువ క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం చనిపోయారన్న వార్తను గలాట్టా యూట్యూబ్ ఛానెల్ ధృవీకరించింది. ప్రముఖ నటి కీర్తి సురేష్, కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు, ధనుష్, టెలివిజన్ యాంకర్ దివ్యదర్శిని సహా పలువురు ప్రముఖులు కౌశిక్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల కాలంలో యుక్త వయస్సులోనే ఎంతో మంది సినీ రంగానికి చెందిన యువకులు మరణిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ.. నిరంతరం వ్యాయమం చేసే వారు గుండె పోటుతో అకాల మరణం చెందడం కలవర పెడుతోంది.
This is heart breaking !! Rest in peace @LMKMovieManiac brother. Gone too soon. My deepest condolences to his family and friends.
— Dhanush (@dhanushkraja) August 15, 2022
Omg! Can’t believe! Spoke to him a couple of days back! Life is really unpredictable! Not fair! Deepest condolences to Kaushik’s family and friends! Gone too soon my friend. #RIPKaushikLM https://t.co/7v0sKrc2jO
— venkat prabhu (@vp_offl) August 15, 2022
I am out of words hearing this news. This is just unbelievable!! My heart goes out to his family and friends. Deepest condolences! Can't believe you are no more Kaushik!#RIPKaushikLM https://t.co/OxQd27ROwj
— Keerthy Suresh (@KeerthyOfficial) August 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.