Fahadh Faasil : ప్రముఖ మళయాల నటుడు ఫాహద్ ఫాసిల్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఇటీవల కొచ్చిలో ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రమాదం గురించి మాట్లాడుతూ.. ఆ ఇన్సిడెంట్ ఫిజికల్‌గా కన్నా మెంటల్‌గా ప్రభావం చూపిందని చెబుతున్నాడు. ముందుగా చిన్నగాయమే అనుకున్నానని.. కోలుకోవడానికి ఇంత సమయం పడుతుందని అనుకోవలేదని తన మనసులో మాట వెల్లడించాడు. త్వరలోనే కుట్లు విప్పేస్తారని తొందరగా మునుపటి వ్యక్తిలో సిద్ధమై షూటింగ్‌లో పాల్గొనాలని చెప్పాడు.
ఫహద్ కోలుకున్న వార్త విని పలువురు ప్రముఖులు సంతోషించారు. నటుడు దుల్కర్ సల్మాన్, నవీన్ నిజాం, సౌబిన్ షాహిర్, అన్నా బెన్ త్వరగా కోలుకోవాలని మెసేజ్ పంపుతూ ఆకాక్షించారు. అతను ప్రస్తుతం థాంకం, మలయన్కుంజు, దిలీష్ పోథన్ యొక్క జోజి వంటి ఐదు ప్రాజెక్టులలో కలిసి పని చేస్తున్నాడు. పట్టు, పాచువుమ్ అల్బుతా విలక్కం వంటి సినిమాల్లో కూడా చేస్తున్నాడు. ట్రాన్స్, సూపర్ డీలక్స్ సినిమాలో కనిపించి మెప్పించిన ఫాసిల్.. 2014లో నజ్రియాను పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
‘మలయన్‌కుంజు’ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరగగా.. ల్యాండ్ స్లైడ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు వేగంపై నియంత్రణ కోల్పోయి కింద పడిపోయినట్టు ఫాహద్ తెలిపాడు. వైద్యం కోసం వెళ్లినప్పుడు గాయం తీవ్రత గురించి వైద్యులు వివరించారని, ముందుగా వారం రోజుల్లో నార్మల్ అయిపోవచ్చని అనుకున్నా గానీ అది జరగలేదన్నాడు. ఈ ఘటనను ప్రకృతి హెచ్చరికగా అభివర్ణించిన ఫాహద్.. తనకు తరచూ ఇలాగే జరుగుతుందని అన్నాడు.