F3 MOVIE: కో బ్రదర్స్ చేసే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ త్వరలో తెరమీదకు… ఎఫ్3 మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
వెంకటేశ్, వరుణ్‌తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అనిల్...
వెంకటేశ్, వరుణ్‌తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. కాగా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2కు సీక్వెల్‌గా ఈ మూవీ వస్తోంది. అయితే ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.