Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఆసుపత్రికి జూనియర్‌ ఎన్టీఆర్‌.

|

Jan 28, 2023 | 7:24 PM

నారా లోకేష్‌ పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మొదట కుప్పంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ తర్వాత బెగంళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు...

Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఆసుపత్రికి జూనియర్‌ ఎన్టీఆర్‌.
Tarakaratna
Follow us on

నారా లోకేష్‌ పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మొదట కుప్పంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ తర్వాత బెగంళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వైద్య బృందాలు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పురందేశ్వరి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా బెంగళూరు బయలు దేరినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేయనున్నారు.

ఇక తారకరత్న గుండెనాళాల్లోకి రక్త ప్రసరణ కావడంలేదని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రావాలంటే మరికాసేపు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..