AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yagnam Movie: 300లకు పైగా సినిమాలు.. యజ్ఞం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? ఆయన కొడుకు తోపు హీరో..

తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది నటీనటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలలో నటించి ఫేమస్ అయిన నటుడుల గురించి చెప్పక్కర్లేదు. కొన్ని వందలాది చిత్రాల్లో నటించి పేరు సంపాదించుకున్న తారలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నటుడు దేవరాజ్ గుర్తున్నాడా.. ?

Yagnam Movie: 300లకు పైగా సినిమాలు.. యజ్ఞం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? ఆయన కొడుకు తోపు హీరో..
Devaraj
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2026 | 10:33 AM

Share

నటుడు దేవరాజ్ గుర్తున్నాడా.. ? ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ ఆ నటుడిని చూస్తే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించారు. సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. దేవరాజ్.. ఎక్కువగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. అందులో యజ్ఞం సినిమా ఒకటి. గోపిచంద్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2004లో విడుదలైంది. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. ఇందులోని పాటలు సైతం పాపులర్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

అప్పట్లో ఈ సినిమా దాదాపు రూ.9 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. గోపిచంద్ కెరీర్ లోనే హయ్యేస్ట్ కలెక్షన్స్ ఇది. ఈ సినిమా తర్వాత హీరోగా వరుస చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా రెడ్డప్ప పాత్రలో నటించారు దేవరాజ్. కన్నడలో ఒకప్పుడు చక్రం తిప్పిన స్టార్ నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ అనేక చిత్రాల్లో కనిపించారు. 1990లో వచ్చిన 20వ శతాబ్ధం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ్, ఎర్ర మందారం, బంగారు బుల్లోడు, వారసుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన దేవరాజ్ .. తర్వాత కాస్త సినిమాలు తగ్గించాడు. చివరగా ప్రభాస్ నటించిన సలార్ మూవీలో కనిపించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే దేవరాజ్ తనయుడు సైతం తోపు హీరో అని మీకు తెలుసా.. ? దేవరాజ్ కొడుకు పేరు ప్రజ్వల్ దేవరాజ్. అతడు కన్నడలో మంచి హీరో. ఇప్పుడిప్పుడే ప్రధాన నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. తెలుగులో జాతర సినిమాతో అలరించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us