
సాధారణంగా సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. నటనతోపాటు అందంలోనూ రాణించిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. బాలనటిగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, కన్నడ భాషలలోనూ నటించి మెప్పించారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ సింధు మీనన్. దివంగత హీరో శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన భద్రాచలం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సహజ నటనతోపాటు అందంతో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత త్రినేత్రం సినిమాతో మరోసారి పాపులర్ అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అంతకు ముందు ఆమె కన్నడ సినీరంగంలోకి బాలనటిగా తెరంగేట్రం చేసింది.
ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.
1996లో వచ్చిన ‘హులియా’ అనే కన్నడ చిత్రంలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా చందమామ. ఈ మూవీలో అల్లరి పిల్లగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఆమె ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడింది. ఆమె కథానాయికగా నటించిన చివరి చిత్రం ఈరం. తెలుగులో వైశాలి పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మరుసటి ఏడాది ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..
ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో నివసిస్తుంది సింధు మీనన్. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం సింధు మీనన్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్.. చందమామ హీరోయిన్ కూతురు ఎంతో చూడచక్కగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..