AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారారు. ఇప్పుడు స్టార్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఓ ముద్దుగుమ్మ ఒకప్పుడు సౌందర్య కూతురిగా నటించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
Soundarya
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 10:54 AM

Share

మంచి పాత్ర దొరికితే తమ టాలెంట్ చూపించడానికి హీరో హీరోయిన్స్ రెడీ గా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే చెలరేగిపోయే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు సహాయక పాత్రలు చేసే నటీమణులు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సహాయక నటిగా రాణించి మెప్పిస్తుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు తన అందంతో మెప్పిస్తుంది. అప్పట్లో సౌందర్య కూతురిగా నటించింది. ఇప్పుడు హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

నందిని రాయ్ బాల్యంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఏడవ తరగతి చదువుతున్నప్పుడు దివంగత నటి సౌందర్యతో కలిసి రాక్సన్ గ్యాస్ ప్రకటనలో నటించే అవకాశం లభించింది. తమ స్కూల్‌లో ఒక హీరోయిన్ యాడ్ షూట్ కోసం వస్తున్నారని తెలియగానే అందరూ ఉత్సాహపడ్డారని ఆమె గుర్తు చేసుకుంది. అప్పట్లో బొద్దుగా, తెల్లగా ఉన్న తనను సౌందర్య స్వయంగా ఎంపిక చేసుకున్నారని, తన తల్లిదండ్రులు సౌందర్యతో నటించే అవకాశం అని తెలిసి వెంటనే అంగీకరించారని తెలిపింది నందిని. ఆ ప్రకటన టీవీల్లో ప్రసారం కావడం, పోస్టర్లు వైరల్ అవ్వడంతో  తాను స్కూల్లో చాలా పాపులర్ అయ్యానని, తనను సౌందర్య కూతురు అని పిలిచేవారని, అది తనకు గొప్ప అనుభూతిని చెప్పుకొచ్చింది నందిని.

నటి కావాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఆమె వివరించారు. సౌందర్య స్కూల్‌కు వచ్చినప్పుడు ఆమెకు స్వీట్ బాక్స్‌లు, చీరలు వంటి బహుమతులు ఇచ్చారని అది చూసి, హీరోయిన్ అయితే ఇలాంటివి ఉచితంగా వస్తాయని భావించి, అప్పటినుంచే నటి కావాలని నిర్ణయించుకున్నానని సరదాగా చెప్పుకొచ్చింది. ఆటోగ్రాఫ్‌ల కాలం నుండి సెల్ఫీల యుగానికి మారడం గురించి మాట్లాడుతూ, ఇటీవల అమలాపురంలో షూటింగ్‌లో పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం తన స్కూల్ రోజులను గుర్తు చేసిందని తెలిపారు. చిరంజీవి, మహేష్ బాబుల నుండి తాను కూడా ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నానని గుర్తు చేసుకుంది నందిని రాయ్.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..