AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్పలో మంగళం శ్రీను పాత్ర నేనే చేయాలి.. కానీ రాసిపెట్టి లేదు..! అందుకే మిస్ అయ్యింది

టాలీవుడ్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాల్లో పుష్పకు ప్రత్యేక స్థానం ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు, ఇందులోని ప్రతి పాత్రకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను ముందుగా ఓ సీనియర్ నటుడిని దృష్టిలో పెట్టుకుని అనుకున్నారట.

పుష్పలో మంగళం శ్రీను పాత్ర నేనే చేయాలి.. కానీ రాసిపెట్టి లేదు..! అందుకే మిస్ అయ్యింది
Pushpa
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2026 | 2:39 PM

Share

టాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఓ ప్రముఖ రియాలిటీ షో ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారారు. తాజాగా ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా సినిమా కథ సిద్ధమైన తర్వాత కొన్ని పాత్రల కోసం దర్శకులు ముందుగా అనుకున్న నటులను సంప్రదిస్తుంటారు. అయితే వివిధ కారణాలతో కొందరు ఆ అవకాశాలను వదులుకుంటారు. ఆ తర్వాత అదే పాత్రలు భారీ విజయాలు సాధిస్తే.. ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్న నటులు కూడా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ సీనియర్ నటుడు తన కెరీర్‌లో ఇలాంటి కీలకమైన అవకాశాన్ని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు సీనియర్ నటుడు శివాజీ.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

ఇటీవల తెల్లకాగితం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. వేదికపై మాట్లాడుతూ తనకు పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్ర చేసే అవకాశం వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను తాను చేయలేకపోయానని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, ఇందులోని పలు పాత్రలకు కూడా విపరీతమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉండేలా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. అలాంటి కీలక పాత్రల్లో ఒకటి మంగళం శ్రీను. ఈ పాత్రలో సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పాత్ర కోసం ముందుగా శివాజీని సంప్రదించారట. తనకు మంగళం శ్రీను పాత్ర వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నానని శివాజీ తెలిపారు. ‘‘ఆ పాత్ర ఆయనకు రాసిపెట్టి ఉంటే మనకెలా వస్తుంది.. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. మనకు ఆ పాత్ర రాసి పెట్టలేదు  అనే అని శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మంగళం శ్రీను పాత్రలో శివాజీ నటించి ఉంటే ఆ పాత్ర మరింత విభిన్నంగా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలోని కీలక పాత్రను శివాజీ మిస్ చేసుకోవడం నిజంగా బ్యాడ్ లక్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు శివాజీకి ఇటీవల వచ్చిన పాత్రలు కూడా మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ‘కోర్టు’ సినిమాలో మంగపతి పాత్రలో ఆయన కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘పుష్ప’లో మంగళం శ్రీను పాత్రను మిస్ చేసుకున్నప్పటికీ.. ‘కోర్టు’లో మంగపతి పాత్ర ద్వారా మరోసారి తన విలనిజంతో మెప్పించారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

Shivaji

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us