AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా ! ఏం మారలేదు భయ్యా..!! మొగలిరేకులు హీరోయిన్ ఎక్కడుంది.? ఏం చేస్తుందంటే

టీవీ సీరియల్స్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓటీటీలు కూడా పెరిగిపోవడంతో పేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల సీరియల్స్ సిద్ధం అవుతున్నాయి. సినిమాల మాదిరిగానే సీరియల్స్ కూడా దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

వారెవ్వా ! ఏం మారలేదు భయ్యా..!! మొగలిరేకులు హీరోయిన్ ఎక్కడుంది.? ఏం చేస్తుందంటే
Mogalirekulu
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 11:19 AM

Share

సీరియల్ అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారా.? ఈ మధ్య మగాళ్లు కూడా సీరియల్స్ తెగ ఇష్టపడుతున్నారు. సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్స్ ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు లేడీస్.. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని మగాళ్లు కూడా పెద్ద ఎత్తున సీరియల్స్ చూడటం మొదలు పెట్టారు. ఇక సీరియల్స్ లో చాలా సీరియల్స్ ప్రేక్షకులను మనసులకు దగ్గరయినవి కూడా ఉన్నాయి. ఎన్ని సీరియల్స్ వచ్చినా కొన్ని సీరియల్స్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే సీరియల్ మొగలి రేకులు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా కంటెంట్ ను మించి ఈ సీరియల్ కథ ఉంటుంది.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

అందమైన లవ్ స్టోరీతో పాటు.. యాక్షన్ సీన్స్.. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. మొగలిరేకులు సీరియల్ ను ఇష్టపడని వారు ఉండరు. ఈ సినిమా ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ఈ సీరియల్ లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన మున్నా అలియాస్ ఆర్కేనాయుడు. అలాగే శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సీరియల్ లో మున్నా , దేవి లవ్ స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందిఅయితే . అయితే ఆర్కే నాయుడు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీరియల్ లో దేవి పాత్రలో నటించిన చిన్నది కుర్రాళ్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరు.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా.?

ఇవి కూడా చదవండి

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

ఆమె పేరు లిఖిత కామిని. ఈ చిన్నది అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మొగలిరేకులు సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ చేసిన ఆమె ఆతర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే లిఖిత కామిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం అయ్యింది. అప్పటి నుంచి ఈ అమ్మడి గురించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. లిఖిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం అప్పటికప్పుడు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఆమె ఓల్డ్ ఫోటీలతో పాటు కొన్ని లేటెస్ట్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉన్నారు.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us