AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..!

House Build: గృహ నిర్మాణ ప్రారంభానికి కొన్ని వారాలను అత్యంత ప్రశస్తమైనవిగా సూచించారు. వాటిలో బుధవారం, గురువారం, శుక్రవారం ముఖ్యమైనవి. ఈ వారాలకు అధిపతులుగా ఉన్న గ్రహాలు శుభప్రదమైనవి. అందుకే ఈ రోజులలో ప్రారంభించిన నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తవుతుందని, ఇంటి యజమానులకు, నివసించే వారికి సౌఖ్యాన్ని కల్పిస్తుందని..

House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..!
House Build
Subhash Goud
|

Updated on: Aug 27, 2026 | 11:00 AM

Share

House Build: మనం నిత్య జీవితంలో చిన్న చిన్న పనులకు కూడా శుభ ముహూర్తాలను చూసుకుంటాం. మరి జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయమైన ఇంటి నిర్మాణం, కొన్ని లక్షలు లేదా కోట్లు విలువ చేసే ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు, వాస్తు శాస్త్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఇంటి నిర్మాణం ఏ రోజు ప్రారంభిస్తే కలిసొస్తుంది? శంకుస్థాపన ఎప్పుడు చేస్తే సమస్యలు లేకుండా పూర్తవుతుంది? ఆ ఇంట్లో నివసించే వారికి సుఖసంతోషాలు కలుగుతాయా? వంటి ప్రశ్నలకు వాస్తు శాస్త్రం వివరణాత్మక సమాధానాలు అందిస్తుంది.

వాస్తు శాస్త్రకారులు, గృహ నిర్మాణ ప్రారంభానికి కొన్ని వారాలను అత్యంత ప్రశస్తమైనవిగా సూచించారు. వాటిలో బుధవారం, గురువారం, శుక్రవారం ముఖ్యమైనవి. ఈ వారాలకు అధిపతులుగా ఉన్న గ్రహాలు శుభప్రదమైనవి. అందుకే ఈ రోజులలో ప్రారంభించిన నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తవుతుందని, ఇంటి యజమానులకు, నివసించే వారికి సౌఖ్యాన్ని కల్పిస్తుందని నమ్ముతారు. ఇక ఇతర వారాల విషయానికి వస్తే, ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారాలు గృహ నిర్మాణానికి సాధారణంగా శుభప్రదములు కావు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే, కొన్ని వారాలకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా రూ.150 కోట్ల బంగ్లా.. ప్రత్యేకతలు ఇవే!

ఇవి కూడా చదవండి

సోమవారం: ఈ రోజుకు అధిపతి చంద్రుడు. చంద్రుడు నైసర్గిక శుభ గ్రహమే అయినప్పటికీ, వాస్తు ప్రకారం, చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు సోమవారం గృహ నిర్మాణానికి మంచిది కాదు. కానీ, చంద్రుడు పూర్ణుడుగా ఉన్నప్పుడు అంటే శుక్ల పక్షంలో సోమవారం గృహ నిర్మాణ పనులను ప్రారంభించడానికి శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.

శనివారం: శనివారం గృహ నిర్మాణం మంచిది కాదని, ఈ రోజున నిర్మాణం ప్రారంభిస్తే తస్కర భయం (దొంగల భయం) కలుగుతుందని కొందరు చెబుతారు. అయితే, మరో అభిప్రాయం ప్రకారం, శనివారం కట్టిన ఇల్లు చాలా కాలం పాటు స్థిరంగా ఉంటుందని, పటిష్టంగా ఉంటుందని చెబుతారు. తస్కర భయం అనే అంశాన్ని పక్కన పెడితే, శనివారం కూడా కొన్ని సందర్భాలలో నిర్మాణ పనులకు పరిగణించవచ్చు.

అయితే, కొన్ని వారాలను పూర్తిగా నివారించాలని వాస్తు శాస్త్రం ఖచ్చితంగా సూచిస్తుంది. ఆదివారం, మంగళవారం గృహ నిర్మాణం, శంకుస్థాపన (భూమి పూజ) లేదా గృహప్రవేశం వంటి ఎటువంటి శుభకార్యాలకూ అనుకూలం కావు. ఈ రోజులలో గృహ సంబంధిత కార్యాలను చేపట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, గృహారంభం, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి అన్ని గృహ కర్మలకు ఆదివారం, మంగళవారం, క్షీణ చంద్రుడుగా ఉన్నప్పుడు సోమవారం దోషపూరితమైనవి. మిగిలిన వారాలు సాధారణంగా శుభప్రదమైనవి. ఈ నియమాలు ప్రాచీన భారతీయ నమ్మకాలు, సంప్రదాయాలలో భాగంగా ఉన్నాయి. ఇవి సుఖమయమైన, సౌఖ్యవంతమైన గృహ జీవితాన్ని కోరుకునే వారికి మార్గదర్శకంగా పనిచేస్తాయి.

ఇది కూడా చదవండి: Fridge Tips: ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా? ఎప్పుడు ఆఫ్ చేయాలి? ఇవి 99 శాతం మందికి తెలియదు.

ఇది కూడా చదవండి: MG EV: సింగిల్‌ ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల రేంజ్.. పవర్‌ఫుల్‌ 7 సీటర్‌ కారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us