AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, చెప్పినట్టు చెయ్ అంటే నావల్ల కాదు: ఎస్తర్ నోరోన్హా

కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఎస్తేర్ నొరోన్హా ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తెలుగులో సాయిరామ్ శంకర్ నటించిన 1000 అబద్ధాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, చెప్పినట్టు చెయ్ అంటే నావల్ల కాదు: ఎస్తర్ నోరోన్హా
Esternoronha
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 10:49 AM

Share

నటి ఎస్తర్ నోరోన్హా గుర్తుందా గుర్తుందా.? ఆమె ఒకప్పుడు సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. భీమవరం బుల్లోడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు, ఆమెను సంప్రదాయబద్ధమైన, డీసెంట్‌గా కనిపించే పాత్రలలో చూశామని, తర్వాత ఆమె బోల్డ్ క్యారెక్టర్స్‌లో కనిపించడంపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఎస్తర్ ఆసక్తికర సమాధానం చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ.. తన ట్రాక్ మార్చుకోవడానికి ప్రధాన కారణం వృత్తిపరమైన ఎదుగుదలే అని తెలిపింది. నేటి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌లను కేవలం ఒక వస్తువులా, హీరో పక్కన ఉండే అందమైన అలంకరణ వస్తువులా చూస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. “నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్‌ని. అబిలిటీ ఉన్న ఆర్టిస్ట్‌ని. ట్రైన్డ్ ఆర్టిస్ట్‌ని” అని చెప్పిన ఎస్తర్, తనలోని నవరసాలు, అలాగే మరికొన్ని ప్రతిభలు ఉన్నాయని తెలిపింది. “నువ్వు ఓన్లీ నీ నేవల్ చూపి, ఓన్లీ క్లీవేజ్ చూపి, ఓన్లీ రెండు డాన్స్‌లు చేసి వెళ్లిపో” అంటే తాను అది మాత్రమే కాదని స్పష్టం చేశారు.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

గతంలో తాను నటించిన భీమవరం బుల్లోడు వంటి సినిమాల్లో కూడా తనకు రెస్పెక్ట్‌ఫుల్‌గా, నీట్‌గా, డీసెంట్‌గానే పాత్రలు దక్కాయని గుర్తు చేసుకున్నారు. అయితే, “నువ్వు ఓన్లీ హీరోయిన్‌లానే జస్ట్ ఒక వస్తువులా ఉండిపో, హీరో మెయిన్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, నువ్వు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపో, నువ్వు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, మనం చెప్పినట్టు చెయ్” అని చెప్పే పాత్రలు తనకు వద్దని ఎస్తర్ కుండబద్దలు కొట్టారు. అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఆసక్తి లేదని, అవి తనను కేవలం అందానికే పరిమితం చేస్తాయని ఆమె తెలిపింది.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

అందుకే, సవాలుతో కూడిన, పర్ఫార్మెన్స్‌కు ఆస్కారం ఉన్న, మంచి స్క్రిప్ట్ ఉన్న పాత్రలను ఎంచుకోవడానికే తాను మొగ్గు చూపుతానని తెలిపింది. తాను చేసిన ప్రతి సినిమా, మొదటి చిత్రం వెయ్యి అబద్ధాలు నుంచి ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల అట్టర్ ఫ్లాప్ లేదా ఎవరూ చూసి తిట్టుకునే సినిమా లేదని గర్వంగా చెప్పింది. “చిల్లర చిల్లర రీజన్స్ వల్ల నేను ఇది ఇలా ఉంది కాబట్టి నేను చెయ్యను అంటే అది నా ఫూలిష్‌నెస్” అని ఎస్తర్ తెలిపారు. అనేక మంది కళాకారులకు కెరీర్‌లో అలాంటి ఒక్క రోల్ కూడా రాదని, తనకు బ్యాక్ టు బ్యాక్ తన క్యాలిబర్‌ను ప్రశ్నించే, సవాలు చేసే పాత్రలు వస్తున్నప్పుడు “ఐ ఫీల్ మోర్ ప్రివిలేజ్డ్ అండ్ మోర్ ఆనరడ్” అని చెప్పుకొచ్చింది. ఒక సింహం వేటాడకుండానే జింకను తెచ్చి ఇచ్చినట్లుగా, తాను వెతుక్కుండానే మంచి అవకాశాలు తన వద్దకు వస్తున్నాయని ఆమె తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us