Tollywood: ప్రభాస్‌ హీరోయిన్‌ అన్షు గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Jan 10, 2023 | 7:15 AM

అన్షు అంబానీ.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ మన్మథుడు సినిమా హీరోయిన్‌ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. మన్మథుడు చిత్రంలో సెకండ్ హీరోయిన్‌ పాత్రలో నటించిన ఈ బ్యూటీ అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒకే ఒక్క సినిమాతో ఎక్కడా లేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన క్యూట్‌...

Tollywood: ప్రభాస్‌ హీరోయిన్‌ అన్షు గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Anshu Ambani
Follow us on

అన్షు అంబానీ.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ మన్మథుడు సినిమా హీరోయిన్‌ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. మన్మథుడు చిత్రంలో సెకండ్ హీరోయిన్‌ పాత్రలో నటించిన ఈ బ్యూటీ అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒకే ఒక్క సినిమాతో ఎక్కడా లేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటన, అందంతో మెస్మరైజ్‌ చేసింది. మహేశ్వరి అనే అమాయక యువతి పాత్రలో ఆకట్టుకుంది. దీంతో ప్రభాస్‌ సరసన మెయిన్‌ హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది బ్యూటీ. రాఘవేంద్ర చిత్రంలో కనిపించింది మెప్పించింది.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో అన్షు కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందని అంతా భావించారు. నటించిన తొలి సినిమాలో బెస్ట్‌ సపోర్ట్ రోల్‌కు గాను ఫిలిమ్‌ఫేర్‌ అవార్డుకు అన్షు నామినేట్ అయింది. ఆ తర్వాత జై అనే ఓ తమిళ చిత్రంలో నటించింది బ్యూటీ. అయితే అన్షు కెరీర్‌ జట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుందని అంతా భావించిన తరుణంలో అన్షు ఒక్కసారిగా తెరమరగైంది. 2004లో వచ్చి జై చిత్రం తర్వాత ఈ బ్యూటీ మళ్లీ ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించలేదు. అన్షు పేరుకు ఇండియన్‌ అయినా లండన్‌లో జన్మించింది. ఫ్యాషన్‌ డిజైనరగా కెరీర్‌ ప్రారంభించి నటిగా రాణించింది.

ఇవి కూడా చదవండి

2003లో రాఘవేంద్ర సినిమా విడుదల తర్వాత లండన్‌కు చెందిన సచిన్‌ సాగర్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన అన్షు ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం అన్షు లండన్‌లో భర్తతో నివసిస్తోంది. అన్షుకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అన్షు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. ‘ఇన్‌స్పిరేషన్‌ కోచర్‌’ అనే క్లాతింగ్ బిజినెస్‌ చేస్తోంది. తాజాగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా భర్త, కూతురుతో కలిసి సరదాగా గడిపింది. అలాగే భర్త బర్త్‌డే పార్టీలో తళుక్కుమంది ఈ బ్యూటీ. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట సందడి చేశాయి. మన్మథుడు చిత్రంతో తెలుగు వారి మదిని దోచిన అన్షు ఇప్పుడు లండన్‌లో ఇలా స్థిరపడిందన్నమాట. అయితే వెండి తెరకు ఇన్నేళ్లు దూరంగా ఉన్నా అన్షు అందం ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇప్పటికీ మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చేలా మెస్మరైజ్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..