రానా కోసం దర్శకుల ఎదురుచూపులు..!
కథ ఓకే అయ్యాక హీరో డేట్స్ కోసం ఒకరు లేదా ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తుండటం మామూలుగా జరిగే విషయమే. అయితే వివైధ్య నటుడు రానా కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. అతడు డేట్స్ ఇస్తే తమ సినిమాలను మొదలుపెడదామని వారందరూ స్క్రిప్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రానా ‘1945’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వీటితో పాటు రానా పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. […]
కథ ఓకే అయ్యాక హీరో డేట్స్ కోసం ఒకరు లేదా ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తుండటం మామూలుగా జరిగే విషయమే. అయితే వివైధ్య నటుడు రానా కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. అతడు డేట్స్ ఇస్తే తమ సినిమాలను మొదలుపెడదామని వారందరూ స్క్రిప్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం రానా ‘1945’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వీటితో పాటు రానా పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హిరణ్యకశప’ ఒకటి కాగా.. ఈ ఏడాది మొదట్లోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ఆయన భావించాడు. అయితే రానా డేట్స్ ఫుల్ ఉండటంతో అతడి కోసం ఎదురుచూస్తున్నాడు గుణశేఖర్.
మరోవైపు ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల, ‘గృహం’ దర్శకుడు మిలింద్ రావ్‌లకు రానా ఓకే చెప్పగా.. వారిద్దరు కూడా అతడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ‘సైలెన్స్’లోనూ ఓ కీలక పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రానా ముందు ఎవరికి డేట్స్ ఇస్తాడో..? వీటిలో ఏ చిత్రం ముందు సెట్స్ మీదకు వెళ్లనుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.