తనదైన అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్(Lady Superstar) గా పేరు తెచ్చుకుంది నయనతార (Nayanthara). ఓవైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కాగా ఆమె గత కొంతకాలంగా డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh shivan) తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఒకరి పుట్టిన రోజు వేడుకలను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా జంటగానే వెళుతున్నారు. వీరి ప్రేమ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వీరి ఫొటోలకు మంచి క్రేజ్ ఉంది. నయనతారకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. దీంతో ఆమె ప్రియుడు విఘ్నేశే నయన్ ఫొటోలను, వెకేషన్‌కు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటాడు. అలా తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
సాధారణంగా ఎక్కడికైనా జంటగానే వెళ్లే ఈ లవ్ బర్డ్స్ ఒకరినొకరు మిస్ అవుతున్నారట. ఈ సందర్భంగా నయన్ హాలీడే ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన విఘ్నేశ్ ‘నీతో జర్నీని మిస్ అవుతున్నా. సినిమాకి సంబంధించిన కొంచెం పని పెండింగ్‌లో ఉంది. అది పూర్తి చేసి వస్తాను. లాంగ్ హాలీడే కొనసాగిద్దాం’ అని తన ప్రేయసిపై ప్రేమ కురిపించాడు. కాగా ఈ జంట కొత్త ఏడాది వేడుకలను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరుపుకుంది. ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రేమపక్షులిద్దరూ సంయుక్తంగా ‘రౌడీ పిక్చర్స్’ పేరుతో ఓ ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించారు. ‘కూజంగల్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా అస్కార్ బరిలో కూడా నిలిచింది. విఘ్నేశ్ ప్రస్తుతం ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, సమంత, నయనతార తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు నయన్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో నటిస్తోంది.
Also Read:Lata Mangeshkar: లతాజీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆశా భోస్లే.. దీదీ ఆరోగ్య పరిస్థతిపై ఏం చెప్పారంటే..
ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో
Khiladi: క్యాచ్ మీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. రవితేజ ఖిలాడిని పట్టుకోవడం కష్టమే..