Puneeth Rajkumar: పునీత్‌ బయోపిక్‌ తీయండంటూ దర్శకుడికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. డైరెక్టర్‌ ఎలా స్పందించాడంటే..

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్‌ 29న హార్ట్‌ ఎటాక్‌ కారణంగా పునీత్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే...

Puneeth Rajkumar: పునీత్‌ బయోపిక్‌ తీయండంటూ దర్శకుడికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. డైరెక్టర్‌ ఎలా స్పందించాడంటే..
Puneeth Raj Kumar Biopic

Updated on: Nov 23, 2021 | 8:53 AM

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్‌ 29న హార్ట్‌ ఎటాక్‌ కారణంగా పునీత్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబసభ్యులతో పాటు యావత్‌ సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. పునీత్‌ లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి చేరువైన పునీత్‌ కడసారి చూపు కోసం వేలాది మంది అభిమానులు బెంగళూరుకు బారులు తీరిన పరిస్థితి చూశాం. ఇదిలా ఉంటే ఇప్పటికే సోషల్‌ మీడియాలో పునీత్ పేరు మారుమోగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని పునీత్ రాజ్‌ కుమార్‌ బయోపిక్‌ తీయాలని ట్వీట్ చేశారు. సంతోష్‌ ఆనందారం అనే దర్శకుడిని ఓ ఫ్యాన్‌ ట్యాగ్‌ చేస్తూ.. ‘ సర్‌.. ప్లీజ్‌ అప్పు(పునీత్‌) సర్‌ మీద ఓ బయోపిక్‌ తీయండి. అప్పును దగ్గరి నుంచి చూశారు. ఆయన ప్రేమించే విధానం, పాటించే నైతిక విలువల గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు. అలాంటి మీరు దయచేసి అప్పు సర్‌ జీవితాన్ని తెర మీద చూపించండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు బదులిచ్చిన సంతోష్‌.. ‘అప్పు సర్‌ ఎప్పటికీ జీవించే ఉంటారు. తెరమీద ఆయన జీవితాన్ని చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో పునీత్ బయోపిక్‌ వార్త ఒక్కసారిగా వైరల్‌ అయ్యింది. ఒక స్టార్‌ హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న పునీత్‌ జీవిత కథ మంచి బయోపిక్‌గా నిలుస్తుందని ఆయన ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

Also Read: ఓ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. అది మన సొంతమవుతుంది.! చట్టం ఏం చెబుతోంది?

Paytm: 2 రోజుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా సంపద ఆవిరి!.. ఎందుకు ఇలా జరిగింది..

Benefits of Turmeric: శీతాకాలంలో పుసుపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..