AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.. రామ్ గోపాల్ వర్మ..

డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాగే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలకు సైతం విపరీతైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటూ సమాజంలోని పలు అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఆర్జీవీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ గురించి తన మనసులోని భావాలను పంచుకున్నారు.

Tollywood : ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.. రామ్ గోపాల్ వర్మ..
Rgv
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2026 | 6:34 PM

Share

తెలుగు చిత్రసీమలో తనదైన సంచలన శైలితో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభపై, ఆయన తెరకెక్కించిన అజరామర కావ్యమైన ‘శంకరాభరణం’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. తమ విద్యార్థి దశలో వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు వంటి పూర్తి కమర్షియల్ మాస్ సినిమాలు చూస్తున్న సమయంలో ‘శంకరాభరణం’ వంటి సంప్రదాయబద్ధమైన సినిమా రావడం ఒక పెద్ద ఆశ్చర్యమని గుర్తు చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, తమలాంటి స్టూడెంట్స్ తో పాటు మిడిల్ క్లాస్ ఆడియన్స్ అంతా ఈ సినిమాను ఎగబడి చూశారని తెలిపారు. భారతీయ సంప్రదాయ ఆచారానికి, శాస్త్రీయ సంగీతానికి ‘శంకరాభరణం’ ఒక క్లాసిక్ ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో వెస్టర్న్ (పాశ్చత్య) సంగీతానికి అలవాటుపడి మన సొంత సంగీతాన్ని మర్చిపోతున్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, “మన భారతీయ శాస్త్రీయ సంగీతం పాశ్చాత్య సంగీతం కంటే ఏమాత్రం తక్కువ కాదు, ఇంకా ఎక్కువే” అని విశ్వనాథ్ గారు నిరూపించిన తీరు అద్భుతమని వర్మ ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..

ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ పాశ్చాత్య సంగీత పెను తుఫానులో రెపరెపలాడుతున్న భారతీయ సత్సంప్రదాయ సంగీత జ్యోతికి అడ్డుగా నిలిచి కాపాడిన మహామహుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే శంకరశాస్త్రి పాత్ర , మంజు భార్గవి పాత్రల మధ్య వచ్చే ఆ అద్భుతమైన ఎమోషనల్ సటిల్ రియాక్షన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వర్మ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో తగ్గని డిమాండ్..

తాను వ్యక్తిగతంగా సంప్రదాయాలను లేదా ఆచారాలను నమ్ముతానా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక ఫిలిం మేకర్‌గా కె. విశ్వనాథ్ గారి ‘శంకరాభరణం’ సినిమా నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని వర్మ వెల్లడించారు. ఆయన దర్శకత్వ శైలి, ఆలోచనలు , కథనాన్ని నడిపించిన తీరు తన సినీ ప్రయాణం పై ఎంతో ప్రభావం చూపాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారె

Follow Us