AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: వయసు కారణం కాదు.. టీమిండియాలో షమీకి అందుకే చోటు దక్కడం లేదంట ?

Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉండటంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షమీని పక్కనబెట్టడానికి వయసు ఒక్కటే కారణం కాదని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఉదాహరణ చూపిస్తూ ఆయన అసలు కారణాలెంటో చెప్పుకొచ్చారు.

Mohammed Shami: వయసు కారణం కాదు.. టీమిండియాలో షమీకి అందుకే చోటు దక్కడం లేదంట ?
Mohammed Shami
Rakesh
|

Updated on: Sep 13, 2026 | 6:23 PM

Share

Mohammed Shami: భారత జట్టులో 36 ఏళ్ల మహ్మద్ షమీ రీఎంట్రీ మీద గత కొద్దికాలంగా చాలా చర్చ నడుస్తోంది. షమీకి వయసు పైబడటం వల్లే సెలెక్టర్లు పక్కనబెడుతున్నారనే వార్తలను మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. కేవలం వయసు ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటే, షమీ కంటే వయసులో పెద్దవారైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఎలా కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అందుకే షమీ విషయంలో వయసును ఒకంకగా చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

షమీ జాతీయ జట్టుకు దూరమవడానికి ప్రధాన కారణం ఆయన గాయాలు కాదని ఆకాశ్ చోప్రా విశ్లేషించారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న షమీ రంజీ ప్రాజెక్టులతో పాటు దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్ చేసి వికెట్లు సాధించిన మాట వాస్తవమే. అయితే గతంతో పోలిస్తే ఆయన బౌలింగ్ వేగం, మైదానంలో పదును తగ్గాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టిన ఆ పాత ఇంటెన్సిటీ ఇప్పుడు షమీ బౌలింగ్‌లో కనిపించడం లేదని, ఇదే సెలెక్టర్లను యోచనలో పడేసిందని చెప్పారు.

గత ఒకటిన్నర సంవత్సర కాలంగా షమీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవధిలో సెలెక్టర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ వేగవంతమైన బౌలర్లపై ఎక్కువ నమ్మకం ఉంచారు. రాబోయే ముఖ్యమైన టోర్నీలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కోసం కొత్త బౌలర్లను తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ ఉంది. ఫలితంగా నిలకడైన వేగం, ఫిట్‌నెస్ సాధించే వరకు షమీకి రీఎంట్రీ అంత సులభం కాదు అనిపిస్తోంది.

షమీ సేవలు భారత జట్టుకు ఎంతో అమూల్యమైనవని, ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారని చోప్రా కొనియాడారు. అయితే ప్రస్తుతం ఫిట్‌నెస్, బౌలింగ్ ఎఫెక్టివ్‌నెస్ ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. సెలెక్టర్ల మనసులో ఏముందో అధికారికంగా వెల్లడిస్తే తప్ప పూర్తి స్పష్టత రాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో షమీ తన పాత వేగాన్ని రిపీట్ చేస్తే తప్ప జట్టులోకి రావడం కష్టమేనని ముగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us