సినిమా సక్సెస్ ఆనందంలో ‘118’ డైరెక్టర్

తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు కేవీ గుహన్. సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్.. 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతవారం విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. దర్శకుడు కావాలనన్న తన 20 ఏళ్ల కల.. 118 సినిమాతో నిజం అయిందన్నాడు గుహన్. ఈ సినమా అంతా ఓ మ్యాజిక్‌లా జరిగిపోయిందన్నాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగానే […]

సినిమా సక్సెస్ ఆనందంలో ‘118’ డైరెక్టర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:45 PM

తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు కేవీ గుహన్. సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్.. 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతవారం విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. దర్శకుడు కావాలనన్న తన 20 ఏళ్ల కల.. 118 సినిమాతో నిజం అయిందన్నాడు గుహన్. ఈ సినమా అంతా ఓ మ్యాజిక్‌లా జరిగిపోయిందన్నాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగానే ఈ సినిమా చేశానన్నాడు.

ఓ గదిలో.. నిద్రిస్తున్నప్పుడు తనకు ఓ కల వచ్చిందని.. అదే కలను ఓ సినిమాగా తెరకెక్కించాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు గుహన్. తనకు వచ్చిన కలతో పాటు… తన నిజం జీవితంలోని జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు తెలిపాడు.