Director tests positive for Corona: టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. అటు షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సీరియల్ నటీనటులతో పాటు.. ఇటు ఇంట్లో ఉన్న వారికి సైతం కరోనా సోకుతోంది. తాజాగా మరో దర్శకుడు ఈ వైరస్ బారిన పడ్డారు. ఆర్‌ఎక్స్ 100తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకుంటానని, ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్ వెల్లడించారు.
కాగా ఈ దర్శకుడు ‘మహా సముద్రం’ను తెరకెక్కించనున్నారు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా నటించనున్నారు. అలాగే తాను మహా సముద్రంలో నటిస్తున్నానని సాయి పల్లవి సైతం క్లారిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రానప్పటికీ, కరోనా పరిస్థితులు కాస్త సర్దుకున్న తరువాత మహా సముద్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
Read This Story Also: ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమం.. గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి
Vachesindi
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
త్వరలో వస్తా..
ప్లాస్మా ఇస్తా…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020