ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమం.. గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి

గ్రామాల ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రోజు వారీ సాధారణ అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారానే సరఫరా చేయబోతోంది

ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమం.. గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 6:44 AM

Water connection for AP villages: గ్రామాల ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. బావులు, బోర్ల నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితికి ఇకపై చెల్లుపడనుంది. రోజు వారీ సాధారణ అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారానే సరఫరా చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 95.66 లక్షల ఇళ్లు ఉంటే అందులో ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లకు కుళాయిలు ఉన్నాయి. మిగిలిన 63.73 లక్షల ఇళ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిన గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ(ఆర్‌డబ్ల్యూఎస్‌).. వచ్చే నాలుగేళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.10,975 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఈ ఖర్చులో సగం కేంద్రం జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం భరించనుంది.

తొలి విడతగా  32 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక రెండో ఏడాది 25 లక్షలు, మూడో ఏడాది 5 లక్షలు, నాలుగో ఏడాది మిగిలిన ఇళ్లకు కొత్త కనెక్షన్లను ఇవ్వనున్నారు. మంచినీటి పథకం, ఓవర్‌హెడ్‌‌ ట్యాంకులు వంటివి ఉన్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  ఆ తర్వాత 75 శాతం ఇళ్లకైనా నీటి సరఫరా చేసే సామర్థ్యం ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతను ఇస్తారు.

Read This Story Also: కరోనాకు చెక్ పెట్టేందుకు మరో ఔషధం రెడీ..!