బంపర్ ఆఫర్ కొట్టేసిన గద్దలకొండ గణేష్ హీరోయిన్.. బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న డింపుల్ ?

హీరో వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో సూపర్ హిట్టు అనే సాంగ్‏లో మెరిసింది డింపుల్ హయాతి. తెలుగులోకి

బంపర్ ఆఫర్ కొట్టేసిన గద్దలకొండ గణేష్ హీరోయిన్.. బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న డింపుల్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 27, 2021 | 7:24 AM

Heroine Dimple Hayathi: హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో సూపర్ హిట్టు అనే సాంగ్‏లో మెరిసింది డింపుల్ హయాతి. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది చిన్న సినిమాతోనే అయినా.. ఆఫర్లు మాత్రం భారీగానే అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘అత్రంగి రే’ సినిమాలో డింపుల్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సారా అలీఖాన్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‏లో తన లక్‏ను పరీక్షించుకోనుంది డింపుల్.

Also Read:

టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?