ఆ విషయంలో ప్రభాస్‌తో ఎలాంటి వివాదం రాలేదు: దిల్ రాజు

| Edited By:

Feb 05, 2020 | 10:00 AM

తమిళంలో ఘన విజయం సాధించిన 96ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్‌పై అప్పట్లో ఓ వివాదం ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టింది. అదేంటంటే రాధా కృష్ణ […]

ఆ విషయంలో ప్రభాస్‌తో ఎలాంటి వివాదం రాలేదు: దిల్ రాజు
Follow us on

తమిళంలో ఘన విజయం సాధించిన 96ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్‌పై అప్పట్లో ఓ వివాదం ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టింది.

అదేంటంటే రాధా కృష్ణ కుమార్ దర్వకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రానికి జాన్ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ టైటిల్‌ను దిల్ రాజు 96 రీమేక్ కోసం రిజిస్ట్రర్ చేయించగా.. దానిపై ప్రభాస్ టీమ్ చిన్నబుచ్చుకున్నట్లు ఆ మధ్యన కొన్ని పుకార్లు గుప్పుమన్నాయి. అంతేకాదు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ బావుంటుందని.. అందుకే దీన్ని వదులుకునేందుకు ప్రభాస్ టీమ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదన్న గాసిప్‌లు వినిపించాయి. కానీ ఇప్పుడే జానుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వా, సమంత. ఈ క్రమంలో ఆ వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.

ఈ సినిమాకు జాను అన్న టైటిల్‌ను అనుకున్న తరువాతే.. ప్రభాస్ తన మూవీ కోసం జాన్ అనే పేరు పెట్టాలనుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే ప్రభాస్ టీమ్‌ను సంప్రదించగా.. జాను టైటిల్‌తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్పారట. ఈ నేపథ్యంలో వారి అంగీకారంతో జాను అనే టైటిల్‌ను 96 రీమేక్‌కు పెట్టామని.. ఇందులో ఎలాంటి వివాదం లేదని ఈ బడా నిర్మాత చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు ప్రభాస్ టైటిల్‌పై ఈ మధ్య నిర్మాతలు స్పందించారు. జాన్ అనే టైటిల్‌ను తాము అనుకోలేదని, కనీసం పరిశీలించను కూడా లేదని వారు స్పష్టతను ఇచ్చారు. కాగా ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.