AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్ల తరువాత దిల్‌ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!

టాలీవుడ్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్‌ నిర్మాతల లిస్ట్‌లో దిల్‌ రాజు మొదటి వరుసలో ఉంటారు. అటు కమర్షియల్‌, ఇటు లోబడ్జెట్‌ చిత్రాలు తీయడంలో అతడికి అతడే సాటి

15 ఏళ్ల తరువాత దిల్‌ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 4:16 PM

Share

Dil Raju News: టాలీవుడ్‌లో ఉన్న సక్సెస్‌ఫుల్‌ నిర్మాతల లిస్ట్‌లో దిల్‌ రాజు మొదటి వరుసలో ఉంటారు. అటు కమర్షియల్‌, ఇటు లోబడ్జెట్‌ చిత్రాలు తీయడంలో అతడికి అతడే సాటి. అంతేకాదు తన బ్యానర్‌లో దిల్‌ రాజు ఎంతోమంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. వారిలో కొంతమంది ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు. అలా దిల్‌ రాజు ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. భద్ర సినిమా ద్వారా బోయపాటి దర్శకుడిగా పరిచయం కాగా.. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.

ఈ సినిమా వచ్చి 15 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ మధ్యలో ఈ కాంబోలో మరో చిత్రం రాలేదు. భద్ర తరువాత దిల్‌రాజు, బోయపాటి మధ్య క్లాషెస్ వచ్చాయని.. రీమేక్ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో టాక్ నడిచింది. కారణాలేవైనా వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క చిత్రం మాత్రమే వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం దిల్‌ రాజు- బోయపాటి మళ్లీ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే దిల్ రాజు, బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ మూవీని తీస్తున్న బోయపాటి.. ఆ మూవీ తరువాత దిల్ రాజు బ్యానర్‌లో సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read more:

మెగాస్టార్ చెల్లెలిగా సాయి పల్లవి ఫిక్స్‌..!

అంపైర్ల ఫిర్యాదు.. కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌కు హెచ్చరిక

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు