అంపైర్ల ఫిర్యాదు.. కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌కు హెచ్చరిక

ఐపీఎల్‌లో కోల్‌తా టీమ్‌కి మరో షాక్ తగిలింది. స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. శనివారం రాత్రి పంజాబ్, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో

అంపైర్ల ఫిర్యాదు.. కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌కు హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2020 | 2:45 PM

Sunil Narine BCCI: ఐపీఎల్‌లో కోల్‌తా టీమ్‌కి మరో షాక్ తగిలింది. స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. శనివారం రాత్రి పంజాబ్, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైల్‌ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతడు బౌలింగ్‌ వేయొచ్చు. కానీ మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే మాత్రం మా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు సునీల్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఉండదు అని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. కాగా మిస్టరీ బౌలింగ్‌ వలన గతంలోనూ సునీల్‌ పలుమార్లు నిషేదం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Read more:

ట్రంప్ వీరాభిమాని కృష్ణ హఠాన్మరణం

నీపై రెస్పెక్ట్‌ రోజురోజుకు పెరుగుతుంది.. రకుల్‌పై క్రిష్‌ ప్రశంసలు