Dil Raju: శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. అల్లు అర్జున్‌పై కేసు గురించి ఏమన్నారంటే?
సంధ్య థియేటరల్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడు శ్రీ తేజ్ ను దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం (డిసెంబర్ 24) ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను కలిశారు. సినీ పరిశ్రమ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోన్న బాలుడిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. మంగళవారం (డిసెంబర్24) కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన భాస్కర్ ను పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రి వద్దే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం. ఇటీవల TFDC కు చైర్మన్ గా ఇచ్చే సమయం లో ఇండస్ట్రీ కు ప్రభుత్వానికి వారధిగా పని చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని రోజులు హైదరాబాద్ లో లేకపోవడం తో హాస్పిటల్ కు రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం (డిసెంబర్ 24) సీఎం ను కలిశాను. రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీ లో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సిఎం కు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుండి ఇండస్ట్రీ కు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
‘ఇక శ్రీ తేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రీకవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలు తెలుసుకుంటాను. సినిమా కు సంబంధించిన అందరం త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతోందనేది దుష్ప్రచారం. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు సిఎం భరోసా ఇవ్వమన్నారు.. అందుకే ఇక్కడి వచ్చి భాస్కర్ కు భరోసా ఇస్తున్నాం. రేవతి చనిపోవడం బాధాకరం. భాస్కర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని దిల్ రాజు భరోసా ఇచ్చారు.
కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతోన్న దిల్ రాజు..
CM Revanth Reddy said he will give an appointment tomorrow or tomorrow.
We all from the film industry will go and meet CM Revanth Reddy – Film Development Chairman Dil Raju 🔥🔥#Pushpa2TheRule #GameChanger
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) December 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.