Dhanush: టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరంటే..? ధనుష్ ఆసక్తికర కామెంట్స్

అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ సినీ ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు స్టార్ హీరో ధనుష్. కోలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర నటుల సరసన నిలుస్తున్న ధనుష్.. టాలీవుడ్‌లో తన ఫేవరెట్ స్టార్ ఎవరో చెప్పారు. 

Dhanush: టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరంటే..? ధనుష్ ఆసక్తికర కామెంట్స్
Dhanush
Follow us

|

Updated on: May 03, 2023 | 1:55 PM

అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ సినీ ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు స్టార్ హీరో ధనుష్. కోలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర నటుల సరసన నిలుస్తున్న ధనుష్.. టాలీవుడ్‌లో తన ఫేవరెట్ స్టార్ ఎవరో చెప్పారు. పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ హీరోగా ధనుష్  అన్నారు. షాట్‌ బ్రేక్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడిన స్టార్ హీరో తన ఇంట్రస్ట్‌ల గురించి రివీల్ చేశారు. ఇప్పుడిది అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్‌లో వరుస సక్సస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్నారు హీరో ధనుష్. రీసెంట్‌గా సర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా తన వైపు తిప్పుకున్న ఈ వర్సటైల్ స్టార్‌… ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్‌ కెప్టెన్ మిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ధనుష్‌ రీసెంట్‌గా బ్రేక్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సెషనల్‌లో టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాన్‌ అని చెప్పటంతో ఆ కామెంట్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయ్యింది. పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ హీరోని ధనుష్ గతంలో ధనుష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ధనుష్ ఇదే విషయాన్ని చెప్పడంతో.. పవన్ ఫ్యాన్స్ ధనుష్ గతంలో చేసిన ట్వీట్‌ను మళ్లీ వైరల్ చేస్తున్నారు.

తెలుగు విషయంలోనే కాదు తమిళ హీరోల విషయంలోనూ జాగ్రత్తగా రిప్లై ఇచ్చారు ధనుష్‌. విజయ్‌, అజిత్‌లలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆ ఇద్దరు నాకు చాలా ఇష్టం… కానీ మీరు గట్టిగా అడిగితే మాత్రం నా ఫేవరెట్‌ హీరో రజనీకాంత్ అనే చెబుతా అంటూ తప్పించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చాట్ సెషన్‌లో సమంత గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ధనుష్‌. సమంత చాలా టాలెంటెడ్ నటి.. ఆమెతో కలిసి నటించటం గర్వంగా ఉంది అన్నారు.

(సతీష్ రెడ్డి, TV9 ET టీమ్)