No Time No Die: జేమ్స్‌ బాండ్‌కు ‘కరోనా’ఎఫెక్ట్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

| Edited By:

Mar 05, 2020 | 2:08 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 80 దేశాలకు పైగా విస్తరించిన ఈ మహమ్మారి 3,285 ప్రాణాలను తీసుకుంది. రోజు రోజుకు ఈ వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఎఫెక్ట్ సినిమాలపై కూడా పడింది.

No Time No Die: జేమ్స్‌ బాండ్‌కు కరోనాఎఫెక్ట్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 80 దేశాలకు పైగా విస్తరించిన ఈ మహమ్మారి 3,285 ప్రాణాలను తీసుకుంది. రోజు రోజుకు ఈ వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఎఫెక్ట్ సినిమాలపై కూడా పడింది. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో తమ సినిమాల రిలీజ్‌లను వాయిదా వేసుకుంటున్నారు పలువురు. ఈ క్రమంలో జేమ్స్ బాండ్ తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ను ఏడు నెలలకు వాయిదా వేశారు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయాలని భావించినప్పటికీ.. కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్‌కు వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అలాగే వివిధ దేశాల్లో ప్రీమియర్ షోలను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వారు తెలిపారు. కరోనా లక్షణాలు ఒక ప్రేక్షకుడికి ఉన్నా.. ఆ తరువాత అది అందరికీ వ్యాపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు అని వారు వెల్లడించారు. అంతేకాదు కరోనా ఎఫెక్ట్ కలెక్షన్లపై కూడా పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట

ఇదిలా ఉంటే హాలీవుడ్‌లోనే కాదు మిగిలిన సినీ ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. కరోనా తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతుండగా.. తమ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని పలువురు దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే విదేశాలకు షూటింగ్‌కు వెళ్లాలనుకున్న వారు కూడా అక్కడ తమ షెడ్యూల్‌లను వాయిదా వేసుకుంటున్నారట. కరోనా కాస్త తగ్గిన తరువాతే తమ సినిమాల షూటింగ్‌లు ప్రారంభించాలని భావిస్తున్నారట. కాగా భారత్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..!