టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులందరు ఓటీటీ వైపు అడుగులెస్తున్నారు. థియేటర్లలో సినిమాలు విడుదలైవుతున్న కానీ.. ఓటీటీలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇక టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి డిజిటల్ మీడియా వైపు అడుగెలేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రారంభం కానున్న ఓ వెబ్ సిరీస్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ యువ చిత్ర నిర్మాతలతోపాటు డైరెక్టర్స్ కూడా ఆహా కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విరాట పర్వం డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించే ప్లాన్ లో ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్లో స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. రాబోయే పరిస్థితులలో థియేటర్లతోపాటు ఓటీటీలకు ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అగ్రహీరోలు, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ ఈ డిజిటల్ మీడియా వైపు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికలో సమంత అక్కినేని సామ్ జామ్ అనే షో ప్రారంభించి.. సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేశారు. ఆహాలో షోలు, సినిమాలతోపాటు, వెబ్ సిరీస్లను ఎక్కువగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read:
మంచు వారమ్మాయి దాతృత్వం.. వారికోసం వంద కిలోమీటర్లు సైకిల్ పై పయనం.. వీడియో వైరల్..