Godfather OTT: ఓటీటీలోకి వచ్చేసిన చిరు ‘గాడ్ ఫాదర్’.. స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చునంటే.?

'గాడ్ ఫాదర్' ఓటీటీ హక్కులను దిగ్గజ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్..

Godfather OTT: ఓటీటీలోకి వచ్చేసిన చిరు 'గాడ్ ఫాదర్'.. స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చునంటే.?
Godfather
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 19, 2022 | 12:49 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’కు ఇది తెలుగు రీమేక్. ఈ మూవీలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేపే కలెక్షన్లతో అదరగొట్టింది. థియేటర్లలో లాంగ్ రన్ ముగించకున్న ఈ చిత్రం.. ఇకపై ఓటీటీలో సందడి చేయనుంది.

‘గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను దిగ్గజ ఓటిటి సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ అనగా నవంబర్ 19 నుంచి ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా.. తమన్ బాణీలు స్వరపరిచాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఆహాలో ‘సర్దార్’:

కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు పిఎస్ మిత్రన్ కాగా.. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. సర్దార్ చిత్రం అటు తెలుగు, ఇటు తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. నిన్నటి(నవంబర్ 18) నుంచి ఓటీటీ ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే