ఒకే వేదికపైకి చిరంజీవి, మోహన్ బాబు.. ఉత్కంఠ రేపుతున్న సమావేశం

|

Feb 20, 2022 | 7:43 AM

తెలుగు సినిమా రంగం టాలీవుడ్(Tollywood) లో సంచలన సమావేశానికి ఫిలింనగర్(Film Nagar) వేదిక కానుంది. కల్చరల్ సెంటర్ వేదికగా చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు(Mohan Babu) సమావేశం కానున్నారు...

ఒకే వేదికపైకి చిరంజీవి, మోహన్ బాబు.. ఉత్కంఠ రేపుతున్న సమావేశం
Chiru Mohan
Follow us on

తెలుగు సినిమా రంగం టాలీవుడ్(Tollywood) లో సంచలన సమావేశానికి ఫిలింనగర్(Film Nagar) వేదిక కానుంది. కల్చరల్ సెంటర్ వేదికగా చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు(Mohan Babu) సమావేశం కానున్నారు. ఫలితంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పరిశ్రమలోని 24 క్రాఫ్టులకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా వ్యాపారానికి సంబంధించి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డ భిన్న పరిస్థితులు, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాలతో చర్చలపై రెండుగా విడిపోయిన టాలీవుడ్ పెద్దలు, ఒకరిపై మరొకరు ఆరోపణలు, ట్రోలింగ్స్ పై పోలీసులకు ఫిర్యాదులు.. ఇలాంటి క్లిష్టతర వాతావరణంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మా ఎన్నికల ముందు నుంచి ఇటీవల సీఎం జగన్ తో భేటీ వరకు ఉప్పు, నిప్పులా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికపైకి రానుండటం విశేషం.

కరోనా సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొన్న ఒడుదొడుకులు, ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టుడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా), ఫిలిం ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. టాలీవుడ్ 24 క్రాఫ్టుల ప్రతినిధుల కీలక సమావేశానికి మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి బృందం భేటీ కావడానికి ముందే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా, రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ సర్కారుతో చిరంజీవి బృందం జరిపిన చర్చల్లో సానుకూల ప్రతిపాదనలు వెలువడిన క్రమంలో… ఈ నెలాఖరులోనే సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆదివారం నాటి టాలీవుడ్ కీలక సమావేశం ఉత్కఠ రేకెత్తిస్తోంది.

ఇవీ చదవండి.

Team India: ఐపీఎల్ వద్దంది.. టీమిండియా రమ్మంది.. ఆ యంగ్ ప్లేయర్‌కు టెస్ట్ జట్టులో చోటిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?

నెక్ట్ సెంచరీ ఇక్కడే చేయాలంటోన్న పాక్ ఫ్యాన్స్.. పీఎస్‌ఎల్‌లో మారుమోగిన విరాట్.. ఎందుకో తెలుసా?

Water Melon: పుచ్చకాయ గింజలతో సహా తింటున్నారా.. అయితే ఇవి తెలుసకోండి..