మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను అభినందించారు.. ఇది నా విజయం అంటూ.. సంతోషాన్ని పంచుకున్న డైరెక్టర్..

డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో రవితేజ కాంబినేషన్లో వచ్చిన క్రాక్ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి

  • Rajitha Chanti
  • Publish Date - 9:05 pm, Tue, 19 January 21
మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను అభినందించారు.. ఇది నా విజయం అంటూ.. సంతోషాన్ని పంచుకున్న డైరెక్టర్..

డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో రవితేజ కాంబినేషన్లో వచ్చిన క్రాక్ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ రెండు వారాలైన కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు క్రాక్ యూనిట్‏కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి టీంకు మెగా హీరో రామ్ చరణ్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి దర్శకుడు గోపిచంద్ మలినేనికి ఫోన్ మరీ అభినందించారట. ఈ విషయాన్ని గోపిచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు.

మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను అభినందించారు. సినిమా కంటెంట్ టేకింగ్ చాలా బాగుందని చెప్పారు. ఆయన మాటలతో నాకు ఆకాశంలో తెలుతున్నట్టుంది. చంద్రునిపై కాలు మోపినట్టుంది అంటూ షేర్ చేశాడు గోపిచంద్. ఇక ఈ సినిమా హిట్‏తో రవితేజ మళ్ళీ తన ఫాంలోకి వచ్చాడు. కాగా అటు డైరెక్టర్ గోపిచంద్ కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చెయనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Hero Surya: మళ్ళీ ‘సింగం’ కాంబినేషన్ రిపీట్.. సూర్య కోసం కథను రెడీ చేసిన యాక్షన్ డైరెక్టర్..

Charan, Pawan Multistarrer: బాబాయ్ అబ్బాయ్‌లతో మెగా మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్న శంకర్..?