సైరా: మెగా ఫ్యాన్స్‌కు పెద్ద షాక్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో సంబరపడ్డ మెగాభిమానులు.. ఇకపై ఆయనను సంవత్సరానికి ఒకసారైనా తెరపై చూస్తామని భావించారు. అయితే వారి ఆశలు మాత్రం తీరేలా లేవు. ‘ఖైదీ నంబర్.150’ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం చిరు తన ప్రతిష్టాత్మక చిత్రం సైరాలో నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న సైరా విడుదల అవ్వనుందని.. అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. దీంతో మెగాభిమానులు […]

సైరా: మెగా ఫ్యాన్స్‌కు పెద్ద షాక్

Edited By:

Updated on: Jun 07, 2019 | 3:52 PM

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో సంబరపడ్డ మెగాభిమానులు.. ఇకపై ఆయనను సంవత్సరానికి ఒకసారైనా తెరపై చూస్తామని భావించారు. అయితే వారి ఆశలు మాత్రం తీరేలా లేవు. ‘ఖైదీ నంబర్.150’ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం చిరు తన ప్రతిష్టాత్మక చిత్రం సైరాలో నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న సైరా విడుదల అవ్వనుందని.. అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. దీంతో మెగాభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు ఈ ఏడాది ‘సైరా’ రాదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సైరా సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చినా.. గ్రాఫిక్స్‌కు మరింత సమయం పట్టనుంది. అసలే చిరు ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఏ విషయంలోనూ చిత్ర యూనిట్ రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లోనూ సైరా ఔట్‌పుట్ సంతృప్తి ఇచ్చిన తరువాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే మూవీ విడుదల ఆలస్యం కానుందని.. వచ్చే ఏడాది సంక్రాంతికి సైరా ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సైరా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నిహారిక, తమన్నా, అనుష్క, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.