BellamKonda Suresh: తండ్రీ, కొడుకులపై చీటింగ్ కేసు నమోదు.. రూ. 85 లక్షలు అప్పు తీసుకొని మోసం చేశారంటూ..

BellamKonda Suresh: ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత (Tollywood Producer) బెల్లం కొండ సురేష్‌, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas)పై చీటింగ్‌ కేసు నమోదైంది. తన వద్ద అప్పు తీసుకొని మోసం చేశారంటూ..

BellamKonda Suresh: తండ్రీ, కొడుకులపై చీటింగ్ కేసు నమోదు.. రూ. 85 లక్షలు అప్పు తీసుకొని మోసం చేశారంటూ..
Bellamkonda Suresh

Updated on: Mar 11, 2022 | 6:31 PM

BellamKonda Suresh: ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత (Tollywood Producer) బెల్లం కొండ సురేష్‌, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas)పై చీటింగ్‌ కేసు నమోదైంది. తన వద్ద అప్పు తీసుకొని మోసం చేశారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్‌లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సినిమా నిర్మాణం కోసం డబ్బులు కావాలంటూ తన దగ్గర మొత్తం రూ. 85 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ హైదరాబాద్‌, బంజారహిల్స్‌కు చెందిన శరణ్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

సినిమా నిర్మిస్తానంటూ బెల్లంకొండ సురేష్‌, శ్రీను 2018లో తన వద్ద రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచందర్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమా ఉందంటూ చెప్పి మరోసారి రూ. 35 లక్షలు తీసుకున్నారని. తీరా నాలుగేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని శరణ్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన నాంపల్లి కోర్టు తండ్రీ, కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Akhil Agent: అఖిల్‌ ‘ఏజెంట్’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్‌..

Samantha: ఇది నాకు నచ్చిన లుక్ అంటున్న సమంత.. చైతు మరదలు ఆశ్రిత కామెంట్

Redmi Note 11 Pro+: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..