Singer Mano: ప్రముఖ సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు

|

Sep 12, 2024 | 10:00 AM

ప్రముఖ గాయకుడు మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఇద్దరిపై దాడిచేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు..

Singer Mano: ప్రముఖ సింగర్‌ మనో కుమారులపై పోలీస్ కేసు.. పరారీలో ఇద్దరు కుమారులు
Singer Mano
Follow us on

చెన్నై, సెప్టెంబర్ 12: ప్రముఖ గాయకుడు మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఇద్దరిపై దాడిచేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు..

చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్ధి వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతోపాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్‌ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళసరవాక్కం పోలీసులకు సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వల్సరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు.

పరారీలో ఉన్న వారిలో మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కొంతమంది వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్‌లు, కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నట్లు చూపుతున్నాయి. రోడ్డు పక్కన ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు కనిపించాయి. గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు కూడా ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. మద్యం మత్తులో ఉన్న వీరు అసభ్య పదజాలంలో తిడుతూ, దాడికి పాల్పడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా గాయకుడు మనో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో పాటలు పాడారు. ఆయన తెలుగు చిత్రసీమలోనూ ఎన్నో పాపులర్‌ సాంగ్స్ ఆలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.