ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తిరుమూల్‌లైవాయల్‌లో ఉదయ్ శంకర్ అనే వ్యక్తి తన తల్లి శాంతితో కలిసి నివసిస్తున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఉదయ్ శంకర్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 3న ఉదయ్ శంకర్ తన అత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఉదయ్ శంకర్ తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలికి ఎల్విన్ వీణులకు పరిచయం ఉందని.. ఉదయ్ శంకర్ కనిపించకపోవడానికి వారిద్దరు కారణమని సందేహంగా ఉందని ఫిర్యాదులో వెల్లడించింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.