AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యూటీ ‘ఫెయిరీ టేల్’ లుక్ అదుర్స్ కదా..! ఫ్రెంచ్ రివేరా వీధుల్లో మెరిసిన బాలీవుడ్ భామ

ప్రపంచవ్యాప్తంగా సినీ మరియు ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ తన తొలి లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రముఖ డిజైనర్ యశ్ పాటిల్ రూపొందించిన కస్టమ్ బాల్ గౌనులో అలియా ఫ్రెంచ్ రివేరా వీధుల్లో మెరిసిపోయారు.

ఈ బ్యూటీ ‘ఫెయిరీ టేల్’ లుక్ అదుర్స్ కదా..! ఫ్రెంచ్ రివేరా వీధుల్లో మెరిసిన బాలీవుడ్ భామ
Alia Bhatt In White Dress
Nikhil
|

Updated on: May 13, 2026 | 7:30 PM

Share

సోషల్ మీడియాలో అలియా భట్​ కేన్స్​ టుక్​ ఫోటోలు విడుదలైన నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. అలియా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ “CANNES 2026” అని క్యాప్షన్ ఇచ్చారు. అలియా ధరించిన ఈ గౌను కేవలం ఒక దుస్తువు మాత్రమే కాదు, అదొక అందమైన కళాఖండం. దీని వెనుక ఉన్న కొన్ని విశేషాలేంటో తెలుసుకుందాం..

ఈ గౌనును 1950ల నాటి ప్రసిద్ధ సిల్హౌట్‌ల నుండి స్ఫూర్తి పొంది తయారు చేశారు. ఇందులో వింటేజ్ స్టైల్‌ను ఆధునిక ఎలిగెన్స్‌తో కలగలిపారు. ఈ గౌనులో యాంగ్యులర్ కప్స్‌తో కూడిన బాడీస్, డ్రాప్ వేస్ట్ మరియు సిల్క్ ఆర్గాంజా, టల్లే లేయర్లతో కూడిన భారీ స్కర్ట్ ఉన్నాయి. ఈ గౌనుపై బాసూరి చోక్సీ చేతితో గీసిన పెయింటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఫ్రెంచ్ రివేరాలోని సుందర దృశ్యాలు, లావెండర్ పొలాలు మరియు రొమాన్స్‌ను ప్రతిబింబించేలా ఈ పెయింటింగ్‌ను రూపొందించారు.

మినిమల్ మేకప్

అలియా తన మేకప్ మరియు హెయిర్ స్టైల్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించారు. గౌను యొక్క స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ హైలైట్ అయ్యేలా ఆమె ‘ఫ్రెంచ్ బన్’ హెయిర్ స్టైల్‌ను ఎంచుకున్నారు. మేకప్‌ను ఎంతో సహజంగా ఉంచారు. న్యూడ్ పింక్ గ్లాసీ లిప్స్, షిమ్మరీ బ్రౌన్ ఐషాడో, బుగ్గలపై కొద్దిగా పింక్ బ్లష్‌తో ఆమె లుక్ పూర్తి అయ్యింది. ఆభరణాల విషయానికి వస్తే, కేవలం చిన్న ఇయర్ రింగ్స్ ఉంగరాలతో సింపుల్‌గా మెరిశారు. కేన్స్ ప్రధాన వేదికపైకి రాకముందే, అలియా ‘కరోలినా హెర్రెరా’ డిజైన్ చేసిన ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ లుక్​ 2026లో ‘క్యాప్రిస్’ (Capris) ట్రెండ్ కాబోతున్నాయని హింట్ ఇచ్చింది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!