ముసుగు మాటున దాగిన అందం ఎవరో గుర్తుపట్టారా.? ఈ బ్యూటీ ఫొటో పోస్ట్‌ చేస్తే నెట్టింట సెగలు పుట్టాల్సిందే.

సినిమా అంటే బయట నుంచి చూసే వారికి అదో రంగుల ప్రపంచం. ఎక్కడికి వెళ్లినా పలకరించే అభిమానులు, లగ్జరీ కార్లు, హోటళ్లు, పార్టీలు చాలా మందిలో ఉండే భావన ఇదే. అయితే బిజీ షెడ్యూల్‌, తీరిక లేని సమయం, పదే పదే ప్రయాణాలు ఇది సెలబ్రిటీల జీవితాల్లో ఉండే మరో కోణం. బిజీ షెడ్యూల్స్‌ కారణంగా కొన్ని...

ముసుగు మాటున దాగిన అందం ఎవరో గుర్తుపట్టారా.? ఈ బ్యూటీ ఫొటో పోస్ట్‌ చేస్తే నెట్టింట సెగలు పుట్టాల్సిందే.
Guess The Actress

Updated on: May 21, 2023 | 10:34 AM

సినిమా అంటే బయట నుంచి చూసే వారికి అదో రంగుల ప్రపంచం. ఎక్కడికి వెళ్లినా పలకరించే అభిమానులు, లగ్జరీ కార్లు, హోటళ్లు, పార్టీలు చాలా మందిలో ఉండే భావన ఇదే. అయితే బిజీ షెడ్యూల్‌, తీరిక లేని సమయం, పదే పదే ప్రయాణాలు ఇది సెలబ్రిటీల జీవితాల్లో ఉండే మరో కోణం. బిజీ షెడ్యూల్స్‌ కారణంగా కొన్ని సందర్భాల్లో సరిగ్గా నిద్రకూడా పోని పరిస్థితులు ఉంటాయి. ట్రావెలింగ్‌లోనే కునుకు తీసే రోజులు ఎన్నో ఉంటాయి. తాజాగా తనకు ఎదురైన ఇలాంటి అనుభవన్నే అభిమానులతో పంచుకుంది అందాల తార.

విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో నిద్రలో మత్తులో చేసిన ఇన్‌స్టా రీల్‌ను పోస్ట్‌ చేసిందా బ్యూటీ. పైన ఫొటోలో మాస్క్‌ ధరించిన ఈ బ్యూటీ ఎవరో ఇంతకీ గుర్తుపట్టారా.? మొహం కనిపించకుండా ఎలా గుర్తుపట్టేది అనేగా మీ సందేహం. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ మాములుది కాదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తన గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేసింది. నెగిటివ్‌ షెడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం లభించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

తాజాగా మంగళవారం అనే సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ పాటికే ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టేశారు కదూ! అవును మీ గెస్‌ కరెక్టే.. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఫ్లైట్ జర్నీలో బాగా అలసి పోయిన పాయల్ తన బాధను వివరిస్తూ ఓ రీల్‌ను పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..