Guess The Actress: ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

|

Feb 18, 2023 | 12:30 PM

సోషల్‌ మీడియా ఎంతటి సమాచార విప్లవాన్ని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపించే రోజులు వచ్చేశాయ్‌. దీనంతటికీ సోషల్ మీడియానే కారణం. అంతేకాకుండా ఎంతో సామాన్యులను సైతం...

Guess The Actress: ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
Guess The Actress
Follow us on

సోషల్‌ మీడియా ఎంతటి సమాచార విప్లవాన్ని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపించే రోజులు వచ్చేశాయ్‌. దీనంతటికీ సోషల్ మీడియానే కారణం. అంతేకాకుండా ఎంతో సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా మార్చిన ఘనత కూడా సోషల్‌ మీడియాకే దక్కిందని చెప్పాలి. సోషల్‌ మీడియా ద్వారా పేరు సంపాదించుకొని ఏకంగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు.

పైన ఫొటోలో కనిపిస్తోన్న బ్యూటీ కూడా ఈ జాబితాలోకే వస్తుంది. పారిస్‌లో ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా బ్యాక్‌ అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈమెకు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ మాములుది కాదు. బిగ్‌బాస్‌లోనూ తళుక్కుమని కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. అందంతోనే కాకుండా తన బోల్డ్‌ పనులతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికైనా ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

ఇవి కూడా చదవండి

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో పలు బోల్డ్‌ ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యిందీ బ్యూటీ. ఈపాటికే ఈమె ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవును మీరు అనుకుంటోంది కరెక్ట్. ఈ చిన్నది మరెవరో కాదు ఆషూ రెడ్డినే. సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకపోయినా ఆషూ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. గ్లామరస్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిన్నది ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..