AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎంత మారిపోయింది భయ్యా.. ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా వెలిగిన హీరోయిన్.. ప్రస్తుతం సినిమాలకు గుడ్‌బై చెప్పి నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. ఓ బ్యానర్ పై బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్న ఆమె, ఫిట్‌నెస్ , లుక్స్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో నిలుస్తున్నారు.

Tollywood : ఎంత మారిపోయింది భయ్యా.. ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
Charmy Kaur
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2026 | 4:24 PM

Share

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గ్లామర్ తారగా ఒక వెలుగు వెలిగి, కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో పాటు అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఎంతో మంది నటీమణులు కాలక్రమేణా నటనకు దూరమయ్యారు. అయితే వారిలో కొందరు పూర్తిగా ఇండస్ట్రీని వీడితే, మరికొందరు మాత్రం నిర్మాణ రంగులోకి అడుగుపెట్టి సరికొత్త ప్రయాణాన్ని సాగిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రముఖ హీరోయిన్ ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరోయిన్ చార్మీ కౌర్. ‘మాస్’, ‘లక్ష్మి’, ‘పౌర్ణమి’, ‘రాఖీ’, ‘మంత్ర’, ‘జ్యోతిలక్ష్మి’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనూ నటించి మెప్పించారు. అప్పట్లో టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. హీరోయిన్‌గా వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, నటనకు గుడ్‌బై చెప్పిన చార్మీ ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ రంగంపై దృష్టి పెట్టారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలు, షూటింగ్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు చార్మీ. నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్‌నెస్ , లుక్స్ విషయంలో ఎప్పుడూ కేరింగ్‌గా ఉంటూ నేటి యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు నిత్యం వైరల్ అవుతుంటాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఛార్మీ కౌర్ ఫోటో..

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us