Kayadu Lohar : ఇలా ఉన్నారేంట్రా.. హీరోయిన్ తాగిన వాటర్ బాటిల్ ధర అన్ని లక్షలా.. ? నెట్టింటి పిచ్చేక్కిస్తున్న ఫోటో..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాయదు లోహర్. డ్రాగన్ సినిమాతో ఈ అమ్మడు కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రచ్చ చేస్తుంది. చివరగా ది ప్యారడైజ్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటి విపరీతమైన పోకడలకు పోతుంటుంది. తాజాగా టాలీవుడ్ , సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన కాయదు లోహర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. అంతేకాదు ఆమె ఫ్యాన్ చేసిన ఓ పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదెంటంటే.. ఈ యువ హీరోయిన్ కాయదు లోహర్ వాడిన వాటర్ బాటిల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీలు వాడిన వస్తువులను వేలంలో విక్రయించడం లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మనం చూస్తుంటాం, కానీ ఒక వాటర్ బాటిల్‌కు ఏకంగా లక్షల్లో ధర పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాయదు లోహర్ షూటింగ్ స్పాట్‌లో ఉపయోగించి పడేసిన ఒక వాటర్ బాటిల్‌ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ అయిన ఓఎల్‌ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడట.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
అంతేకాదు, ఆ వాటర్ బాటిల్ ధర అచ్చం సెలబ్రిటీ రేంజ్‌లో ఉండాలన్నట్లుగా ఏకంగా రూ. 3 లక్షలు అని కోట్ చేయడం ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. “ఇదేం పైత్యం బాబు, ఎంగిలి చేసిన వాటర్ బాటిల్‌కు కూడా ఇంత ధర పెడతారా?” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు చేసే ఇటువంటి పనులు ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. అభిమానం వేరు, ఇటువంటి వింత పోకడలు వేరు అంటూ నెటిజన్లు ఆ పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
దీనిపై అటు హీరోయిన్ కాయదు లోహర్ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత వస్తువులను ఇలా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే ది ప్యారడైజ్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది కాయదు. ఇప్పుడు ఈ అమ్మడు బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
వైరలవుతున్న ఫోటో..

Kayadu Lohar
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..
