AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బే డబ్బు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఎప్పటి నుంచి అంటే?

గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేయడం సహజం. అయితే అతి త్వరలో సూర్యుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహకందని ప్రయోజనాలు కలగనున్నాయి. కాగా సూర్యుడి నక్షత్ర సంచారం ఏ రాశులపై తన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 21, 2026 | 4:07 PM

Share
సూర్యుడు అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. నవంబర్ 8 వరకు అక్కడే ఉంటాడు. అందు వలన ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. అలాగే వృత్తి, ఆర్థికపరమైన, వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది. కాగా, ఇప్పుడు మనం ఇది ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

1 / 5
మిథున రాశి :మిథున రాశి వారికి ఈ సూర్య సంచారం పంచమ స్థానంలో జరుగుతుంది.  దీనినే ధన యోగంగా చెబుతారు. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో ఉన్నవారికి భారీ లాభం. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు ఖాయం. పిల్లల ద్వారా శుభవార్త వింటారు.

2 / 5
తుల రాశి : తులా రాశి వారికి ఇది జన్మ రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఇది గోల్డెన్ పీరియడ్. సూర్యుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సొంత ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి, లాభాలు అమాంతం పెరుగుతాయి.

3 / 5
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి వ్యయ స్థానంలో సూర్యుడి సంచారం అయినా ఇది విదేశీ లాభాలను తెస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఇదే సరైన సమయం. ఖర్చులు ఎక్కువైనా అవన్నీ మంచి పెట్టుబడిగా మారతాయి. దీర్ఘకాలిక అప్పుల నుండి బయటపడతారు. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి కోరుకున్న చోటుకే బదిలీ అవుతుంది.

4 / 5
కన్యారాశి : కన్యా రాశి వారికి ఇది ధన స్థానంలో జరిగే సంచారం. నోటితో మాట్లాడి లక్షలు సంపాదిస్తారు. మాట్లాడే రంగంలో ఉన్నవారికి - మీడియా, మార్కెటింగ్, టీచింగ్ వారికి అద్భుతమైన సమయం. కుటుంబంలో ఆస్తి వివాదాలు తొలిగి, మీకు రావాల్సిన వాటా వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం.

5 / 5
Follow Us