Viral Photo: వెన్నెల వెలుగులో ఊయల ఊగుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? నటనకు కేరాఫ్‌ ఈ హీరోయిన్‌..

Viral Photo: ఒకప్పుడు అభిమాన తారల వ్యక్తిగత జీవిత విషయాలు తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్‌ మొత్తం మారిపోయింది. తారలే నేరుగా తమ అభిమానులతో...

Viral Photo: వెన్నెల వెలుగులో ఊయల ఊగుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? నటనకు కేరాఫ్‌ ఈ హీరోయిన్‌..

Updated on: Aug 09, 2022 | 3:24 PM

Viral Photo: ఒకప్పుడు అభిమాన తారల వ్యక్తిగత జీవిత విషయాలు తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్‌ మొత్తం మారిపోయింది. తారలే నేరుగా తమ అభిమానులతో ముచ్చటించే రోజులు వచ్చేశాయ్‌. తమంతటతామే వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. సినిమా సెట్‌లో చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఓ అందాల అలాంటి ఓ వీడియోనే షేర్‌ చేసింది.

పైన ఫొటోలో రాత్రి పూట ఊయల ఊగుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? నటన అందం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు మలయాళ, తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ మరెవరో కాదు.. నిత్యమీనన్‌. ఇంగ్లిష్‌ సినిమాలో బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టిన ఈ బ్యూటీ అనంతరం కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

తర్వాత 2010లో వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. అందంతోనే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా స్కైలాబ్‌, భీమ్లానాయక్‌ సినిమాలతో తెలుగులో సక్సెస్‌ అందుకున్న నిత్యా.. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..