ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికలు: ‘మన ప్యానల్’ ఘన విజయం!

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు ప్యానల్, సి.కళ్యాణ్ ప్యానల్ మధ్య జరిగిన ఈ రసవత్తరమైన పోరులో నిర్మాత కళ్యాణ్ వర్గమే పైచేయి సాధించింది. సి కళ్యాణ్ నేతృత్వం వహించిన ‘మన ప్యానల్’ నుంచి 9 మంది సభ్యులు గెలుపొందగా.. ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్’ నుంచి దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాత్రమే గెలిచారు. ఇకపోతే మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, […]

ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికలు: మన ప్యానల్ ఘన విజయం!

Updated on: Jul 27, 2019 | 4:59 PM

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు ప్యానల్, సి.కళ్యాణ్ ప్యానల్ మధ్య జరిగిన ఈ రసవత్తరమైన పోరులో నిర్మాత కళ్యాణ్ వర్గమే పైచేయి సాధించింది. సి కళ్యాణ్ నేతృత్వం వహించిన ‘మన ప్యానల్’ నుంచి 9 మంది సభ్యులు గెలుపొందగా.. ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్’ నుంచి దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాత్రమే గెలిచారు. ఇకపోతే మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం.

ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగా ఈ ఏడాది ఎగ్జిబిటర్స్‌ విభాగం నుంచి నారాయణ దాస్‌ నారంగ్‌ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దర్శకులు ప్రసన్నకుమార్, నట్టికుమార్ కలగజేసుకుని వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.