‘బుక్ మై షో’లోనూ ఆ ఇద్దరు హీరోలదే హవా!.. ఈ ఏడాది టాప్ 5లో టాలీవుడ్ స్టార్స్ సినిమాలు..
కరోనా సంక్షోభంలోనూ టాలీవుడ్ హీరోల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా మారుతున్న కాలానికి తగ్గట్టుగా జనాలు కూడా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఒక సినిమా చూడాలనుకుంటే..
కరోనా సంక్షోభంలోనూ టాలీవుడ్ హీరోల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా మారుతున్న కాలానికి తగ్గట్టుగా జనాలు కూడా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఒక సినిమా చూడాలనుకుంటే దానికి సంబంధించిన టికెట్లను థియేటర్లకు వెళ్ళి మాత్రమే కొనుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని మూవీ టికెట్లను ఆన్లైన్లోనే కొనేస్తున్నాం. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయాలి అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘బుక్ మై షో’.
అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాల్లో నుంచి టాప్ 5 సినిమాల జాబితాను బుక్ మై షో వెల్లడించింది. ఇందులో తెలుగు సినిమాలే మూడు స్థానాలను దక్కించుకున్నట్లుగా సమాచారం. టాప్ 2వ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురం నిలవగా.. టాప్ 3లో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచింది. వీటితోపాటు నితిన్ నటించిన భీష్మ సినిమా టాప్ 5వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. కానీ అటు బాలీవుడ్ చిత్రాలను కూడా దాటుకొని భారత్లోనే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాలుగా మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన మూడు సినిమాలు నిలిచాయి.