Bigboss4: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్.. ట్వీట్ చేసిన స్టార్ మా.

‘స్టార్ మా’లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అవకాశాన్ని నటి మోనాల్ గజ్జర్ సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ షోకు రాకముందు చిన్న సినిమాల్లో నటించిన ఈ భామకు బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు లభించింది.

Bigboss4: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్.. ట్వీట్ చేసిన స్టార్ మా.
Follow us
Narender Vaitla

| Edited By:

Updated on: Dec 27, 2020 | 10:19 AM

Monal got offer as host: బిగ్‌బాస్ షో ద్వారా చాలా మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొందరు సినిమా అవకాశాలు దక్కించుకుంటే మరికొంత మంది స్టార్ మాలోనే ప్రసారమయ్యే ఇతర ప్రోగ్రామ్స్‌ల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఈ సీజన్‌లో మొదట్లో షో నుంచి బయటకు వచ్చిన గంగవ్వ, సుజాతలు స్టార్ మాలో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘స్టార్ మా’లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తను ఎవరో కాదు నటి మోనాల్ గజ్జర్. బిగ్‌బాస్ షోకు రాకముందు అడపాదడపా సినిమాల్లో నటించిన మోనాల్.. ఈ రియాలిటీ షోతో ఒక్కసారిగా పేరు సంపాదించుకుంది. ఇక హౌజ్‌లో తన అందం, ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టకున్న మోనాల్.. మిగతా హౌజ్ మేట్స్‌కి మంచి పోటీనిచ్చింది. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మకు స్టార్ మా మరో బంపరాఫర్ ఇచ్చింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘డ్యాన్స్ ప్లస్’ అనే షోకి మోనాల్ జడ్జిగా వ్యవహరించనున్నారు. తాజాగా స్టార్ మా యాజమాన్యం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోతో పాటు ఈ విషయాన్ని వెల్లడించింది. మరి మోనాల్ తన హవాను బుల్లి తెరకే పరిమితం చేస్తుందా.. సిల్వర్ స్క్రీన్‌పై కూడా తళుక్కుమంటుందో చూడాలి.